Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూ కేటాయింపు కుంభకోణంలో మధ్యప్రదేశ్ సర్కార్!!

Webdunia
మధ్యప్రదేశ్‌లోని భారతీయ జనతా పార్టీ సర్కారు భూ కేటాయింపు కుంభకోణంలో చిక్కుకుంది. ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు కుశభవ్‌ ఠాక్రే స్మారకార్థం ఏర్పాటు చేసిన ట్రస్టుకు చట్ట విరుద్ధంగా భూమి కేటాయింపులు జరిపినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. సుమారు 60 కోట్ల రూపాయల విలువ చేసే 20 ఎకరాల భూమిని ఈ ట్రస్టుకు ఉదారంగా ఇచ్చినట్టు సమాచారం.

భోపాల్‌ నగర నడిబొడ్డున ఈ 20 ఎకరాల భూమికి సంబంధించిన వివాదాన్ని తాజాగా ఒక న్యూస్ టీవీ ఛానల్ వెలుగులోకి తెచ్చింది. భూమి కేటాయింపులు జరిగిన వైనంపై పూర్తి ఆధారాలతో కూడిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని ఈ ఛానల్‌ ప్రకటించింది. నగరం నడిబొడ్డులో ఉన్న ఈ ప్రధాన భూభాగాన్ని ఠాక్రే ట్రస్టుకు కేటాయించడంలో ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కిందని ఈ ఛానల్‌ వెల్లడించింది.

ప్రధానంగా ఈ ట్రస్టులో సభ్యులుగా ఆ పార్టీ అగ్రనేతలు అద్వానీ, వెంకయ్య నాయుడులు వంటి వారు ఉండగా, భాజపా ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి కైలాస్‌జోషీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఈ 20 ఎకరాల భూమిని 2006లో ప్రభుత్వం ఈ ట్రస్టుకు 33 ఏళ్ల పాటు రూ.25 లక్షల నామమాత్రపు లీజుకు కేటాయించింది. అయితే అప్పట్లో ఈ భూమి విలువను జిల్లా కలెక్టర్‌ రూ.4.60 కోట్లుగా అంచనా వేసినట్టు ఆ ఛానల్ కథనం పేర్కొంది.

అంతేకాకుండా, జిల్లా మేజిస్ట్రేట్‌ సిఫార్సు మేరకు ఈ స్థలానికి సంబంధించిన వార్షిక లీజు రూ.27 లక్షలకు బదులుగా కేవలం ఒక్క రూపాయిని మాత్రమే ట్రస్టు చెల్లిస్తోంది. ఈ ప్రతిపాదనలను అత్యంత వేగంగా పరిష్కరించాలని ప్రభుత్వం కోరినట్లు 2004 ఆగస్టు 16న జిల్లా మేజిస్ట్రేట్‌ రాసిన లేఖ వెల్లడిస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ కోసం నాగార్జున ఎమోషనల్ ఎదురుచూపు !

ఐతే ఏటంటావిప్పుడు?: జీబ్రా మెగా ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి కామెడీ (Video)

ఇప్పటికీ పోసాని నోరు అదుపుకాలేదు.. తక్షణం అరెస్టు చేయాలి : నిర్మాత నట్టి కుమార్

"టాక్సిక్" కోసం వందలాది చెట్లను నరికేసారు.. కేజీఎఫ్ హీరోపై కేసు

బాలకృష్ణ 109వ సినిమా టైటిల్ డాకూ మహరాజ్ - తాజా అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

Show comments