Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌లో ముంబై దాడుల విచారణపై ప్రధాని అసంతృప్తి...!!

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2011 (13:40 IST)
రెండేళ్ల క్రితం ముంబై నగరంపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడిచేసి నరమేథం సృష్టించిన కేసులో పాకిస్థాన్ కొన"సాగి"స్తున్న దర్యాప్తుపై భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లో ముంబై తీవ్ర దాడులకు సంబంధించిన విచారణపై భారత్ "సంతృప్తిగా లేద"ని, అనుమానితులపై కేసులను నమోదు చేయడాన్ని వేగవంతం చేయాలని ప్రధాని కోరారు.

" ఆ కేసులను వేగవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం. అంతకుమించి నేనేం చెప్పగలను. పాకిస్థాన్‌తో మనకు ఉన్న సమస్యలేంటో మీకు తెలుసు. ఈ కేసులో పాక్ అనుసరిస్తున్న తీరుపై మేము సంతృప్తిగా లేమ"ని ముంబై తీవ్రవాద దాడులపై పాక్ విచారణ మీకు సంతృప్తినిచ్చిందా.. అనే ప్రశ్నకు సమాధానంగా మన్మోహన్ సింగ్ చెప్పారు.

గురువారం తాజ్‌ హోటల్‌లో జరిగిన ఇన్ఫోసిస్ కార్యక్రమంలో ముంబై తీవ్రవాడిలో మృతి చెందిన వారికి అంజలి ఘటించిన అనంతర ఆయన మాట్లాడారు. ఆ దాడిలో మృతి చెందిన వారి జ్ఞాపకార్థం నిర్మించిన ఓ స్మారక స్థూపానికి ఆయన పూల మాలవేసి నివాళులు అర్పించారు. దేశ వాణిజ్య రాజధానిపై నవంబర్ 26, 2008లో పాక్ ఉగ్రవాదులు దాడి చేసి 166 మందిని అతి కిరాతంకగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments