Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాజ్‌మహాల్‌పై తీవ్రవాదుల గురి: దేశవ్యాప్తంగా టెర్రర్‌ అలర్ట్‌

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2010 (10:44 IST)
ప్రేమసౌథం తాజ్‌మహాల్‌తో పాటు మరికొన్ని చారిత్రక పర్యాటక కేంద్రాలతో పాటు.. ప్రసిద్ధ ఆలయాలపై తీవ్రవాదులు ఏక్షణంలోనైనా దాడులు జరుపవచ్చని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నయ్, బెంగుళూరు, గోవా, అహ్మదాబాద్, హైదరాబాద్ ప్రాంతాలతో పాటు.. దేశ వ్యాప్తంగా హై అలెర్ట్‌ను ప్రకటించారు.

పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఈ దాడులను నిర్వహించటానికి పథకాన్ని రూపొందిస్తోందని తెలిపింది. దీంతో అన్ని రాష్ట్రాలు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. దాడులను ఎదుర్కొవటానికి అవసరమైతే సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మొహరించాలని కేంద్ర హోంశాఖ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశారు.

ఏ క్షణంలోనైనా తీవ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని హెచ్చరించింది. ముంబైలోని తాజ్‌‌హోటల్‌పై మళ్లీ దాడులు చేసేందుకు పన్నాగాలు రూపొందిస్తున్నారని వారు చెప్పారు. సాఫ్ట్‌వేర్‌ హబ్‌ బెంగళూర్‌, పర్యాటకుల స్వర్గం గోవా కూడా టెర్రరిస్టుల జాబితాలో ఉన్నాయని నిఘా వర్గాలు హెచ్చరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ ఎన్.టి.ఆర్. పేరును వద్దన్న బాలక్రిష్ట

బాలకృష్ణ డాకు మహారాజ్ అసలు నిరాశ పరచదు : సూర్యదేవర నాగవంశీ

ఓటీటీకి నచ్చితేనే సెట్ కు వెళతాను : నిర్మాత నాగవంశీ

#AjithKumar తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కోలీవుడ్ హీరో అజిత్ (Video)

డ్రింకర్ సాయి తో ఇండస్ట్రీలో నాకో స్థానం కల్పించారు - హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

Show comments