Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ అధ్యక్ష పదవీకాలం ఐదేళ్లకు పొడగింపు: కాంగ్రెస్ ప్లీనరీ

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2010 (15:37 IST)
పార్టీ అధ్యక్ష పదవీకాలాన్ని ఐదేళ్లకు పొడగిస్తున్నట్లు ఆదివారం జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో ఏఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పార్టీ అధ్యక్ష పదవీ కాలం మూడేళ్లుగా ఉంది. అయితే దీనిని ఐదేళ్ళకు పొడిగించాలని ప్రతిపాదిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.

దేశ రాజధాని న్యూడిల్లీలో జరుగుతున్న 83వ కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో ఈ తీర్మానం చేయడం జరిగింది. తాజా తీర్మానంతో ఇకపై అధ్యక్ష ఎన్నికలు ఐదేళ్ళకు ఒకసారి మాత్రమే జరగనున్నాయి. పార్టీ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండేజ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ, రక్షణ మంత్రి ఏకె ఆంటోనీ, పార్టీ జనరల్ సెక్రటరీ రాహుల్ గాంధీతో సహా పలువురు ఇతర నేతలు ఈ తీర్మానానికి అంగీకారం తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై పోలీస్ కేసు.. అరెస్టు తప్పదా?

ఏడు నగరాల్లో ప్రమోషన్స్-పుష్ప 2 బాధ్యతలు బన్నీకే.. సుక్కూ బిజీ

సక్సెస్ కోసం నాగార్జున ఎమోషనల్ ఎదురుచూపు !

ఐతే ఏటంటావిప్పుడు?: జీబ్రా మెగా ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి కామెడీ (Video)

ఇప్పటికీ పోసాని నోరు అదుపుకాలేదు.. తక్షణం అరెస్టు చేయాలి : నిర్మాత నట్టి కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

Show comments