Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్, డీఎంకేల మైత్రికి ఎలాంటి ఢోకా లేదు: కనిమోళి

Webdunia
2 జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై సిబిఐ జరుపుతున్న దర్యాప్తు వల్ల ఇటు రాష్ట్రంలోను, అటు కేంద్రంలోను డిఎంకే-కాంగ్రెస్‌ కూటమికి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, తమ మైత్రి అలానే కొనసాగుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్ కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి అన్నారు.

ఈ కేసుకు సంబంధించి తమిళనాడు, న్యూఢిల్లీల్లోని మాజీ టెలికాం మంత్రి ఎ రాజా, కార్పొరేట్‌ లాబీయిస్ట్‌ నీరారాడియా మరియు పలువురు నివాసాలు, కార్యాలయాలపై బుధవారం సిబిఐ సోదాలు నిర్వహించడంతో కనిమోళి పాత్ర వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో కనిమోళి స్పందిస్తూ.. ‘చట్టం తన పని తాను చేసుకుపోవాలి. ఇది మేము తప్పు చేయలేదని నిరూపించుకునే ప్రక్రియ, మేము తప్పకుండా మా నిజాయితీని రుజువు చేసుకుంటామ’ని అన్నారు.

సిబిఐ చేస్తున్న దర్యాప్తును స్వాగతిస్తున్నామని, స్పెక్ట్రమ్‌ కేటాయింపులకు సంబంధించి 2001 నుండి విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు పేర్కొనడం శుభపరిణామమని, దీని వ్లల నిజమైన దోషులు బయటకు వస్తారని ఆమె తెలిపారు. కాగా.. ఈ పరిణామాలు కాంగ్రెస్‌తో మీ పార్టీ సంబంధాలను దెబ్బ తీసాయా అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కనిమోళి సమాధానమిస్తూ.. ‘మా సంబంధాలు ఏమాత్రం దెబ్బ తినలేదు.. ఎలాంటి తప్పూ జరలేదని మేము నిరూపించుకుంటామని నాకు గట్టి నమ్మకం ఉంద’ని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై పోలీస్ కేసు.. అరెస్టు తప్పదా?

ఏడు నగరాల్లో ప్రమోషన్స్-పుష్ప 2 బాధ్యతలు బన్నీకే.. సుక్కూ బిజీ

సక్సెస్ కోసం నాగార్జున ఎమోషనల్ ఎదురుచూపు !

ఐతే ఏటంటావిప్పుడు?: జీబ్రా మెగా ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి కామెడీ (Video)

ఇప్పటికీ పోసాని నోరు అదుపుకాలేదు.. తక్షణం అరెస్టు చేయాలి : నిర్మాత నట్టి కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

Show comments