మావోల అగ్రనేత, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కంచన్ అలియాస్ సుదీప్ చోంగ్దర్‌తో పాటు మరో నలుగురు నేతల అరెస్టుకు నిరసనగా డిసెంబర్ 8, 9 తేదీల్లో పశ్చిమ బెంగాల్ బంద్ నిర్వహించాలంటూ మావోలు పిలుపునిచ్చారు.
తమ పార్టీ చట్టబద్ధమైన రాజకీయ సంస్థ అని, పార్టీ నేతలను అరెస్టు చేయడమంటే భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడ మేనని మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆకాశ్ అలియాస్ అసిమ్ మోండల్ అన్నారు. తమ నాయకులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
గత శుక్రవారం స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కాంచ్‌న్‌తో పాటు మరో నలుగురు మావోయిస్టులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఆకాశ్ భార్య కల్పన మైతీ అలియాస్ అను కూడా ఉన్నారు. వీరిని అరెస్టు చేసిన విషయం తెలిసుకున్న ఆకాశ్ వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.