Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోద్రా అల్లర్లు: గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకీ క్లీన్‌చిట్!

Webdunia
గోద్రా అల్లర్ల కేసులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఊరట లభించింది. గోద్రా అనంతర మారణకాండ కేసులో నరేంద్రమోడీకి సుప్రీం కోర్టు నియమించిన 'ప్రత్యేక పరిశోధన బృందం' (సిట్) క్లీన్ చిట్ ఇవ్వనున్నట్లు సమాచారం.

నరేంద్ర మోడీకి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడంపై రాజ్యసభలో బీజేపీ పక్ష నేత అరుణ్‌జైట్లీ స్పందిస్తూ... చట్టానికి సహకరించాలని బీజేపీ నిర్ణయించింది. కానీ కొందరు బీజేపీకి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూనే ఉన్నారని ధ్వజమెత్తారు.

కాగా.. గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్ల కేసుపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి క్లీన్‌చిట్ ఇచ్చినట్లు అభిజ్ఞ వర్గాలు వెల్లడించాయి. గోద్రా రైలుబోగీ దగ్ధం అనంతరం గుజరాత్‌లో చెలరేగిన అల్లర్లలో వెయ్యి మందికి పైగా చనిపోయిన విషయం తెలిసిందే.

ఈ మారణకాండ వెనుక ముఖ్యమంత్రి మోడీ, ఆయన సన్నిహిత అనుచరుల ప్రోత్సాహం, ప్రోద్బలం ఉందంటూ ఈ అల్లర్లలో మృతి చెందిన కాంగ్రెస్మాజీ ఎంపి ఎహ్‌సాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు జరిపిన సిట్ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది.

అయితే గోద్రా సంఘటన అనంతరం జరిగిన ఈ అల్లర్ల వెనుక మోడీ పాత్రకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని సిట్ తన నివేదికలో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

మెకానిక్ రాకీ నుంచి విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరిల పెప్పీ సాంగ్

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర యూఐ ది మూవీ నుంచి పవర్ ఫుల్ పోస్టర్

సాంప్రదాయ దుస్తులలో మ్యాడ్ గ్యాంగ్ మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ లుక్

పవన్ ఓజీ కోసం రాలేదు కానీ.. శ్రేయా రెడ్డి మాత్రం బాగానే రెడీ అవుతోంది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

Show comments