Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడ్జెట్ సమావేశాలనూ సజావుగా సాగనీయం: అద్వానీ

Webdunia
2 జి స్పెక్ట్రమ్ లైసెన్సుల కేటాయింపుల కుంభకోణంపై దర్యాప్తు చేసేందుకు విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నట్టుగా సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేయని పక్షంలో ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాలను సైతం సజావుగా సాగనీయబోమని భాజపా అగ్రనేత ఎల్కే.అద్వానీ హెచ్చరించారు. స్పెక్ట్రమ్ కుంభకోణం వ్యవహారంపై జేపీసీ ఏర్పాటులో యూపీఏ ప్రభుత్వం మొండివైఖరిని అవలంభిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమై శుక్రవారానికి 16 రోజులు కావస్తున్నా.. సభ పట్టుమని పది నిమిషాలు కూడా సాగలేదు. ఈ పరిస్థితుల్లో ఎన్డీయే కూటమి అనుసరించాల్సిన వ్యూహంపై ఆ పార్టీ నేతలు ఢిల్లీలో భేటీ అయ్యారు.

ఈ భేటీ అనంతరం అద్వానీ మీడియాతో మాట్లాడుతూ.. 1.74 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిన 2జి స్పెక్ట్రమ్ లైసెన్సుల కేటాయింపుపై సమగ్ర విచారణ జరపటానికి జేపీసీని నియమించాలనే ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం ఆమోదించకపోవటం వల్లే శీతాకాల సమావేశాలు జరగడం లేదన్నారు.

ప్రతిపక్షాలు డిమాండ్‌ను యూపీఏ పెద్దమనస్సుతో అర్థం చేసుకుని తన నిర్ణయాన్ని మార్చుకుంటుందన్న విశ్వాసాన్ని అద్వానీ వ్యక్తం చేశారు. 2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో కొత్త కోణాలు వెలువడుతున్నందున జేపీసీ తప్ప పీఏసీ వల్ల ఎలాంటి ఫలితం ఉండబోదన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు.. స్పందించేందుకు నిరాకరించిన భార్య!!

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల సెకండ్ మూవీ మొదలైంది

రికార్డ్-బ్రేకింగ్ వ్యూయర్‌షిప్‌ను సాధించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

Show comments