Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పెక్ట్రమ్ వ్యవహారం: సుప్రీం నుంచి ప్రధానమంత్రికి ఊరట!

Webdunia
స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు నుంచి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ఊరట లభించింది. ఈ కుంభకోణానికి సంబంధించి కేంద్ర టెలికామ్ మాజీ మంత్రి ఏ.రాజాను విచారించేందుకు అనుమతి ఇవ్వడంలో తీవ్ర జాప్యం నెలకొంది. దీన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిని విచారించే నిమిత్తం అనుమతి ఇచ్చేందుకు 17 నెలల సమయం కావాలా అంటూ ప్రధానమంత్రి కార్యాలయంపై మండిపడింది.

ఈ అంశంపై ప్రధానమంత్రి తరపున అపెక్స్ కోర్టులో అడ్వకేట్ జనరలో అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. అఫిడవిట్‌ను పరిశీలించిన కోర్టు... ఈ అంశంలో ప్రధానమంత్రి కార్యాలయానికి ఎలాంటి సంబంధంలేదని పేర్కొంది. కేంద్ర న్యాయశాఖ జాప్యం చేసిందని, అందువల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కోర్టు పేర్కొంది. కోర్టు తాజా వ్యాఖ్యలు ప్రధానికి ఎంతో ఊరట కలిగించేలా ఉన్నాయి.

2 జి స్పెక్ట్రమ్ లైసెన్సుల కేటాయింపు వ్యవహారంలో 1.75 లక్షల కోట్ల రూపాయల మేరకు అవినీతి చోటు చేసుకున్నట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. ఈ మొత్తం కేంద్ర ఖజానాకు చేరకుండా అప్పటి టెలికామ్ శాఖామంత్రి ఏ.రాజా తన అధికారాలను వినియోగించి స్వాహా చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై ఆయన వద్ద విచారణ జరిపేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జనతా పార్టీ అధినేత డాక్టర్ సుబ్రమణ్య స్వామి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై కేంద్రానికి సుప్రీం నోటుసులు జారీ చేసినప్పటికీ కేంద్రం స్పందించని విషయం తెల్సిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Show comments