ఔరంగాబాద్‌లో బాంబు పేలుడు సంభవించింది. బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలో జరిగిన ఈ బాంబు పేలుడు సంఘటనలో దారుణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. బీహార్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల సందర్భంగా పోలీసులు అనేక పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ బాంబులను ప్రజల సంచారం లేని ప్రాంతాల్లో విసిరి వేశారు. వీటిలో పేలని ఓ బాంబు ఆదివారం ఉదయం పేలుడు సృష్టించిందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో ఏడుగురు మరణించినట్లు పోలీసులు అన్నారు.
కానీ ఔరంగాబాద్ జిల్లా దేవ్‌కేప చోకర్‌లో మావోయిస్టులు సిలిండర్ బాంబు పేల్చడంతో ఈ సంఘటన చోటు చేసుకుందని వార్తలు వస్తున్నాయి. బీహార్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయని ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో బాంబు పేలుళ్లు ఆందోళన సృష్టించాయి. ఈ ఘటనలో గాయాలకు గురైన మరో 12 మందిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.