Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర విభజనపై భాజపా-సేనల్లో విభేదాలు!

Webdunia
శుక్రవారం, 15 జనవరి 2010 (14:03 IST)
మహారాష్ట్రను రెండు ముక్కలు చేసి విదర్భ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అంశంపై మిత్రక్షాలైన భారతీయ జనతా పార్టీ, శివసేన పార్టీల మధ్య విభేదాలు పొడచూపాయి. విదర్భ రాష్ట్ర ఏర్పాటుకు భాజపా నేతలు మొగ్గు చూపుతుండగా, శివసేన పార్టీ నేతలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం సానుకూలంగా మొగ్గు చూపడంతో విదర్భలోని వేర్పాటువాదులు సైతం ప్రత్యేక రాష్ట్రం కోసం గళమెత్తారు. అయితే, ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు మహారాష్ట్రను ముక్కలు చేసేందుకు ససేమిరా అంటున్నారు. కానీ, భాజపా మాత్రం విదర్భ ఏర్పాటుకు మొగ్గు చూపుతోంది. ఇందులోభాగంగా, ఈనెల 16వ తేదీ నుంచి ఐదు రోజుల విదర్భ పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు.

అయితే, దీన్ని శివసేన నేతలు వ్యతిరేకిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాం. మహారాష్ట్రలో ఒక అంతర్భాగంగా ఉంటూనే విదర్భ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చని శివసేన నేత సుషాష్ దేశాయ్ అభిప్రాయపడ్డారు. తమ పార్టీ అధినేత బాల్‌థాక్రే కూడా సమైక్య మహారాష్ట్రనే కోరుకుంటున్నారని గుర్తు చేశారు. అందువల్ల రాష్ట్రాన్న విభజించడాన్ని తాము అంగీకరించబోమన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments