Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు బోగీలకు నిప్పు: విచారణకు మమత ఆదేశం

Webdunia
సోమవారం, 1 జూన్ 2009 (18:18 IST)
FileFILE
బీహార్‌లో రెండు రైళ్ళ బోగీలకు నిప్పంటించిన సంఘటనపై కేంద్ర రైల్వే శాఖామంత్రి మమతా బెనర్జీ శాఖాపరమైన విచారణకు సోమవారం ఆదేశించారు. స్థానిక ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఎలాంటి చర్యలను తమ మంత్రిత్వశాఖ చేపట్టబోదని ఆమె స్పష్టం చేశారు.

బోగీలకు నిప్పంటించిన సంఘటనపై ఆమె కోల్‌కతాలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశంపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో మాట్లాడినట్టు చెప్పారు. ఈ సందర్భంగా తాను కానీ, తన మంత్రిత్వ శాఖ గానీ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని ఆమె ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంలో రైల్వే అధికారికి ఎవరికైనా సంబంధం ఉన్నట్టు తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కాగా, సోమవారం జరిగిన సంఘటనను మంత్రి మమతా ఖండించారు. బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాకు 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుస్రుపూర్‌ స్టేషన్‌లో కొన్ని రైళ్ళ హాల్ట్‌ను రద్దు చేశారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు శ్రమజీవన్ ఎక్స్‌ప్రెస్‌తో మరో రైలు బోగీలకు నిప్పంటించారు. దీనివల్ల ఆ మార్గంలో నడిచే రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

Show comments