Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీఏ ఆర్థిక విధానాలు భేష్: సోనియా గాంధీ

Webdunia
FileFILE
కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం గత నాలుగున్నర సంవత్సరాలుగా అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు భేషుగ్గా ఉన్నాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రశంసించారు. అందువల్లే అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ప్రభావం పెద్దగా లేదని ఆమె వ్యాఖ్యానించారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన తొలి అంతర్జాతీయ విమానయాన సర్వీసులకు ఆమె శనివారం పచ్చజెండా ఊపారు.

ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం భారత్‌పై పెద్దగా లేదన్నారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభ ప్రభావం దేశీయ ఆర్థిక వ్యవస్థపై పడలేదంటే అందుకు కేంద్రంలోని అధికార యూపీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలే ప్రధాన కారణమన్నారు.

ప్రపంచంలోని వివిధ దేశాలతో పోల్చుకుంటే ఆర్థిక మాంద్యం చూపిన ప్రభావం మనపై నామమాత్రమే అన్నారు. అనంతరం మజూమ్‌ నుంచి బారాముల్లాకు నడిచే రైలును ప్రారంభించారు. మజూమ్‌ నుంచి బారాముల్లా మధ్య రైలు ప్రాజెక్టును ఓ సవాల్‌గా తీసుకుని పూర్తి చేసిన రైల్వేమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌, ఇతర రైల్వే అధికారులను ఆమె అభినందించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Show comments