Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంహెచ్ 370 ఫ్లైట్ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం!

Webdunia
సోమవారం, 21 ఏప్రియల్ 2014 (12:25 IST)
File
FILE
మార్చి నెలలో గల్లంతైన మలేషియా విమానం ఎంహెచ్ 370 ప్రయాణికుల సమీప బంధువులకు ఆర్థిక సాయం అందించనున్నట్లు మలేషియా ఎయిర్‌లైన్స్ సంస్థ ఆదివారం ప్రకటించింది. మార్చి 8వ తేదీన ఈ విమానం గల్లైంతైన విషయం తెల్సిందే. విమానం కనిపించకుండా పోయిన 44 రోజుల తర్వాత ఈ విషయంపై స్పందిస్తూ మలేషియా విదేశాంగ శాఖ సహాయ మంత్రి హంజా జైనుద్దీన్ ఈ దిశగా తాము రెండు వారాల క్రితమే పని ప్రారంభించినట్లు తెలిపారు.

అందరికీ సహాయం అందిస్తామని, ఇప్పటికే తమ ప్రతినిధులు ప్రయాణికుల బంధువులతో సంప్రదింపులు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. గల్లంతైన విమానంలోని కొందరు ప్రయాణికులు తమ కుటుంబాలకు ప్రధాన ఆధారంగా ఉండేవారని ఆయన అన్నారు.

అలాంటి వారి కుటుంబాల వారు తమ ఆర్థిక స్థితిని తెలియజేస్తూ తాము ఆశిస్తున్న సహాయం మొత్తాన్ని తెలుపాల్సిందిగా ఆయన సూచించారు. 15 వేర్వేరు దేశాలకు చెందిన ప్రయాణికులు ఉన్నందున వారందరి దగ్గర నుంచి వివరాలు తీసుకుని, ఆర్థిక సాయం ఎప్పుడిచ్చేదీ మరోసారి ప్రకటిస్తామని జైనుద్దీన్ చెప్పారు.

కాగా, 239 మంది ప్రయాణికులతో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయల్దేరిన ఎంహెచ్ 370 విమానం మార్చి 8న జాడ తెలియకుండా పోయిన విషయం విదితమే. పలు దేశాలు తీవ్రంగా శోధిస్తున్నా ఇప్పటివరకు ఆ విమానానికి సంబంధించిన ఆనవాళ్లు లభించలేదు. ఈ విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో జల సమాధి అయినట్టు భావిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments