Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణ కొరియాలో పడవ ప్రమాదం : 100 విద్యార్థుల మృతి?

Webdunia
బుధవారం, 16 ఏప్రియల్ 2014 (18:14 IST)
File
FILE
దక్షిణ కొరియాలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో వంద మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు గల్లంతయ్యారు. విహార యాత్రకు వెళ్లిన చిన్నారులు గల్లంతు కావడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంచియాన్ నుంచి బెజు ద్వీపానికి నౌకలో విద్యార్థులు, టీచర్లు విహార యాత్రకు బయలుదేరారు.

ఈ నౌకలో మొత్తం 476 మంది దాక ఉన్నారు. అందులో 338 మంది హై స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. అంతేగాక పదుల సంఖ్యలో కార్లు, ట్రక్కులను రవాణా చేస్తోంది. నైరుతి తీరం వద్ద నౌక సముద్రంలో మునిగిపోయింది. అప్పటిదాక ఉత్సాహంగా ఉన్న విద్యార్థులు హాహాకారలతో నౌకా ప్రాంగణం మారుమ్రోగిపోయింది. ఈ ఘటనలో 100 మందికి పైగా గల్లంతయ్యారు. గల్లంతైనవారి కోసం రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు.

18 హెలికాప్టర్లు, 34 లైఫ్‌ బోట్లతో అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 368 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ప్రయాణికులంతా లైఫ్‌ జాకెట్లతో దూకటం వల్ల పెను ప్రమాదం తప్పిందని, సహాయక చర్యలను వేగవంతం చేసినట్టు ఆ దేశ అధికారులు వెల్లడించారు.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments