Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఫోన్ చోరీ: నెంబర్లు పంపించిన మంచిదొంగ

Webdunia
గురువారం, 28 నవంబరు 2013 (17:57 IST)
FILE
ఫోన్ పోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఫోన్ పోతే ఇంకో ఫోన్ కొనుక్కోవచ్చు. కానీ అందులో ఉండే సమచారం తిరిగి తీసుకురాలేము కదా. అయితే చైనాలోని ఓ దొంగ ఐఫోన్ కొట్టేసి అందులోని సమాచారాన్ని బాధితుడికి పంపించి మంచిదొంగ అనిపించుకున్నాడు. ఫోన్‌లోని సమచారం పంపించాడు కానీ ఫోన్ మాత్రం తిరిగి పంపించలేదట ఈ దొంగోడు. జిన్హువా వార్తా సంస్థ ఈ కథనాన్ని వెల్లడించింది.

చైనాలోని సెంట్రల్ ప్రావిన్స్ హునన్కు చెందిన జో బిన్.. షేరింగ్ టాక్సీలో ప్రయాణిస్తూ తన యాపిల్ ఐఫోన్ పోగొట్టుకున్నాడు. తన ఫోన్ చోరీకి గురైందని గుర్తించి దొంగకు ఒక టెక్ట్స్ మెసేజ్ పంపాడు. తన ఫోన్లో ఉన్న నంబర్ల బ్యాకప్ లేదని, దయచేసి ఐఫోన్ తిరిగిచ్చేయాలని కోరాడు. ఫోన్ తన అడ్రస్కు పంపాలని అందులో విజ్ఞప్తి చేశాడు.

కొద్దిరోజుల తర్వాత తనకు అందించిన ప్యాకేట్ చూసి జో బిన్ ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఫోన్లో ఉన్న 1000 నంబర్లను చేతితో రాసిన 11 పేజీలు అందులో ఉండడం చూసి అతడు అవాక్కయ్యాడు. అయితే దొంగిలించిన ఐఫోన్ మాత్రం పంపలేదు. ఫోన్లో సేవ్ చేసిన నంబర్లు, వారి పేర్లు స్వదస్తూరీతో రాశానని జో బిన్కు సందేశంలో దొంగ పేర్కొన్నాడు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments