Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరియాపై సైనిక చర్యకు సిద్ధమవుతున్న అమెరికా!!

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2013 (10:14 IST)
File
FILE
సిరియాలో పరిస్థితులు మరింతగా క్షీణించి పోవడంతో పరిస్థితి దారికి తెచ్చేందుకు సైనిక చర్య చేపట్టాలని అమెరికా, బ్రిటన్ దేశాలు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటుదారులపై సిరియా బలగాలు అమానుషంగా రసాయ దాడి జరిపి 1300 మంది పౌరులను హతమార్చిన విషయం తెల్సిందే. ఈ చర్యను ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి.

అదేసమయంలో సిరియా పరిస్థితులపై తక్షణం జోక్యం చేసుకుని పరిస్థితులను చక్కదిద్దాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి కోరింది. ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరూన్ దాదాపు 45 నిమిషాల పాటు సిరియా పరిణామాలపై, దాడుల్లో రసాయనిక ఆయుధాలు వినియోగించడమనేది చాలా తీవ్రమైన పరిణామంగా వారు భావిస్తున్నారు.

ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవడం అత్యవసరమని వీరిద్దరూ భావించారు. ఇందులోభాగంగానే సైనిక జోక్యం సహా అనేక ప్రత్యామ్నాయ చర్యలపై వీరిద్దరు చర్చించినట్టు సమాచారం.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments