Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిలావల్ - హీనాల ప్రేమాయణం : లోతుగా ఆరా తీస్తున్న భర్త!

Webdunia
బుధవారం, 26 సెప్టెంబరు 2012 (15:29 IST)
File
FILE
పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్‌ల ప్రేమాయణంపై రబ్బానీ ఖర్ భర్త లోతుగా ఆరా తీస్తున్నట్టు సమాచారం. తన భార్య హీనాతో బిలావల్ భుట్టో సాగిస్తున్న రహస్య ప్రేమ వ్యవహారం ఆ దేశ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేకెత్తించడాన్ని ఈ కోటీశ్వర పారిశ్రామికవేత్త జీర్ణించుకోలేక పోతున్నారు.

ప్రముఖ పారిశ్రామికవేత్తను వివాహం చేసుకున్న హీనా రబ్బానీ ఖర్ ఇద్దరు కుమార్తెలకు తల్లి. ఆమెను పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ తనయుడు, పీపీపీ ఛైర్మన్ బిలావల్ భుట్టో ప్రేమిస్తున్నారు. వీరిద్దరు త్వరలోనే వివాహం చేసుకుని స్విట్జర్లాండ్‌లో సెటిల్‌ కావాలని భావిస్తున్నట్టు బిలావల్ స్వయంగా వెల్లడించారు కూడా.

ఈ నేపథ్యంలో భుట్టో - ఖర్ ప్రేమాయణంపై విదేశాంగ మంత్రి భర్త, మిలియనీర్ ఫిరోజ్ గుల్జర్ వివరాల సేకరణలో నిమగ్నమైవున్నట్టు సమాచారం. ఇందులోభాగంగా తన భార్య హీనా ఫోన్ కాల్స్ జాబితాను అందజేయాల్సిందిగా ఆయన టెలికామ్ శాఖను కోరుతు దరఖాస్తు చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

కాగా, గత వారం రోజులుగా బిలావల్, హీనాల ప్రేమాయణం వ్యవహారాన్ని ప్రతి ఇంటిలో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ కథనాన్ని బంగ్లాదేశ్‌కు చెందిన ఒక పత్రిక ప్రముఖంగా ప్రచురించడంతో ఇది మరింతగా చర్చనీయాంశమైంది. హీనాను ప్రేమిస్తున్నట్టు బిలావల్ స్వయంగా చెప్పినట్టు ఆ పత్రిక తన కథనంలో పేర్కొనడంతో మరింత ఆసక్తికరంగా మారింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

Show comments