Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రంగాల్లో భారత్-చైనాలు దూసుకెళుతున్నాయ్: ఒబామా

Webdunia
విద్య, ఉపాధి, సాంకేతిక రంగాల్లో భారత్, చైనా దేశాలు అత్యంత వేగంగా దూసుకెళుతున్నాయని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అభిప్రాయపడ్డారు. ఈ రెండు దేశాలతో అమెరికాను పోల్చుకుంటే ఎంతో వెనుకబడి ఉన్నామన్నారు.

ఈ పోటీపై ఆయన మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంతో పోటీపడటంలో ఆ రెండు దేశాల యువత ఎంతో చొరవ చూపిస్తున్నారన్నారు. గత సంవత్సరం నవంబర్‌లో చేసిన భారత పర్యటనలో అమెరికా ఆ దేశంతో ప్రతిష్టాత్మకమైన కొన్ని ఒప్పందాలను చేసుకుందని గుర్తు చేశారు.

వీటి వల్ల దేశంలో కొన్ని లక్షల ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. చైనా - భారత్‌తో పాటూ ఆసియా దేశాల సంబంధాల్లో ప్రముఖ పాత్రను పోషిస్తున్న రష్యాతోనూ ధృడమైన సంబంధాలను ఏర్పరుచుకున్నామ ని ఆయన తెలిపారు.

భారత - చైనా దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల అమెరికాకు దేశంలో రెండు లక్షల యాభై వేల ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నట్టు చెప్పారు. అయితే, అమెరికా పెట్టే పెట్టుబడుల కోసం కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా దగ్గుబాటి ప్రెజెంట్స్ లో డార్క్ చాక్లెట్ రాబోతుంది

బ్రాహ్మణికి మణిరత్నం ఆఫర్ ఇస్తే.. నా ముఖం పొమ్మంది.. బాలయ్య

సిద్ధాంతం కోసం కట్టుబడే అందరికీ దిల్ రూబా చిత్రం కనెక్ట్ అవుతుంది : కిరణ్ అబ్బవరం

Renu Desai: కాశీలో సాధువును కలిసిన రేణు దేశాయ్.. విశ్వాసం మేలు చేస్తుంది.. (video)

విజయ్ సేతుపతి రిలీజ్ చేసిన యాక్షన్ మూవీ కోర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

Women Teachers Day: సావిత్రీబాయి ఫూలే జయంతి- మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Show comments