Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే నెలలో భారత్, పాక్ విదేశాంగ కార్యదర్శుల భేటీ

Webdunia
భారత్, పాకిస్థాన్ విదేశాంగ కార్యదర్శుల స్థాయి సమావేశం వచ్చే నెలలో జరుగనుంది. ఫిబ్రవరిలో భూటాన్ రాజధాని థింపూలో సార్క్ దేశాల మంత్రుల సమావేశం జరుగనుంది. ఇందులో భారత్, పాకిస్థాన్‌ల విదేశాంగశాఖ కార్యదర్శుల మధ్య చర్చలు జరుగుతాయని అధికార వర్గాలు తెలిపాయి.

ఈ చర్చల ఫలితాన్ని ఆధారంగా పాక్ విదేశాంగశాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషి భారత్ పర్యటన ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశాల తేదీలు ప్రకటించనప్పటికీ, ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే అవకాశముందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ఎస్.కృష్ణ కూడా సూచన ప్రాయంగా వెల్లడించారు.

ఈ సందర్భంగా ఇరు దేశాల విదేశాంగ శాఖల కార్యదర్శుల స్థాయి చర్చలు జరగడానికి పాక్ అంగీకరించింది. గత జూలై నెలలో భారత విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణ, పాక్ విదేశాంగ మంత్రి ఖురేషిని మన దేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశాలు అర్థవంతమైన ఫలితాలిస్తేనే తాను భారత్‌కు వెళతానని ఖురేషీ స్పష్టం చేసిన విషయం తెల్సిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

Show comments