Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎంఎల్-ఎన్ డిమాండ్లకు సమ్మతించిన ప్రధాని గిలానీ

Webdunia
తన సర్కారు మనుగడను దృష్టిలో ఉంచుకుని ప్రధాన ప్రతిపక్షం పాకిస్థాన్ ముస్లిం లీగ్ - ఎన్ పార్టీ చేసిన పది డిమాండ్లను పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసుఫ్ రజా గిలానీ ఆమోదించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై కూడా విచారణ జరిపించాలన్న డిమాండ్‌తో సహా మొత్తం పది కీలక డిమాండ్లకు ఆయన తలొగ్గారు.

అంతేకాకుండా, పంజాబ్‌లో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), పాకిస్థాన్ ముస్లిం లీగ్ - ఎన్‌ల పొత్తును కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చి ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నట్టు గిలానీ వెల్లడించారు.

పీపీపీ నేతృత్వంలోని పాలన సాగిస్తున్న సంకీర్ణ సర్కారు ప్రతిపక్ష పార్టీల ఒత్తిడికి తలొగ్గి పెంచిన పెట్రోల్ ధరలను తిరిగి ఉపసంహరించింది. ధరలు పెంచడంతో పీఎంఎల్ఎన్, ముత్తాహిదా ఖయామి మూవ్‌మెంట్‌లు సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలగిన విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో తాజాగా సమావేశమైన గిలానీ, పీఎల్ఎన్ ఎన్ అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌లు అన్ని అంశాలపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత ప్రతిపక్షాలు చేసిన పది డిమాండ్లను అంగీకరించేందుకు గిలానీ సమ్మతించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ 25వ చిత్రం ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదల

Surender Reddy: మళ్లీ తెరపైకి సురేందర్ రెడ్డి - వెంకటేష్ తో సినిమా మొదలైంది

మీ ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా : కిరణ్ అబ్బవరం

నాని కి ఈ కథ చెప్పడానికి 8 నెలలు వెయిట్ చేశా : డైరెక్టర్ రామ్ జగదీష్

SS రాజమౌళి, మహేష్ బాబు షూటింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్న ఒడిశా ఉపముఖ్యమంత్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

Show comments