Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా ఎంపీ గిఫోర్డ్‌పై కాల్పులు: ఆరుగురు మృతి!

Webdunia
ఆదివారం, 9 జనవరి 2011 (13:13 IST)
అమెరికాలోని టక్సన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో రిపబ్లిక్ పార్టీ ఎంపీ గిఫోర్డ్ తీవ్ర గాయాలకు గురైయ్యారు. ఈ కాల్పుల్లో ఆరుగురు మరణించగా, 12 మంది గాయపడ్డారు. ముందుగా ఈ కాల్పుల్లో గిఫోర్డ్ మరణించినట్లు వార్తలు వచ్చాయి.

అయితే ఆ వార్తలను ఖండించిన వైద్యులు ఎంపీ గిఫోర్డ్ పరిస్థితి విషమంగా ఉందని, ఎంపీ ప్రాణాలతోనే ఉన్నారని యూనివర్శిటీ మెడికల్ సెంటర్ సమాచార ప్రతినిధి డార్సీ స్లాటెన్ చెప్పారు.

తలలో బుల్లెట్ దూసుకెళ్లిందని, కానీ ఎంపీని కాపాడవచ్చుననే నమ్మకం ఉందని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎంపీకి శస్త్ర చికిత్స జరుగుతోంది. కాగా, ఈ కాల్పుల్లో గాయపడిన మరో 9 మందికి కూడా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

షాపింగ్ సెంటర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గిఫోర్డ్ పాల్గొనాల్సి ఉండగా, ఓ గుర్తు తెలియని వ్యక్తి ఎంపీపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, మరో 12 మంది గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారిశ్రామికవేత్త బర్త్‌డే పార్టీలో ఎంజాయ్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు

త్రిబాణధారి బార్బరిక్ లో సరికొత్త అవతారంలో ఉదయ భాను

అమ్మవారి జాతర నేపథ్యంగా జాతర- మూవీ రివ్యూ

రామ్ చ‌ర‌ణ్ గేమ్ చేంజర్ టీజ‌ర్ రిలీజ్‌కు 11 చోట్ల భారీ స‌న్నాహాలు

నాకు స్ఫూర్తి సూర్య నే : ఎస్ఎస్ రాజమౌళి - అవకాశం మిస్ చేసుకున్నా: సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

Show comments