Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంగరక్షకుడి చేతిలో హతమైన పాక్ పంజాబ్ గవర్నర్!

Webdunia
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధినేత్రి బెనజీర్ భుట్టో దారుణ హత్యకు అనంతరం భారీ ఘోరం పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది. పాకిస్థాన్‌లో బలమైన రాజకీయ నాయకుడు, పంజాబ్ రాష్ట్ర గవర్నర్ సల్మాన్ తసీర్‌ను ఆయన అంగరక్షకుడే హత్యచేశాడు. మంగళవారం ఇస్లామాబాద్‌లో పాక్ పంజాబ్ గవర్నర్‌ను సెక్యూరిటీ గార్డే పొట్టనబెట్టుకున్న ఉదంతం సంచలనం సృష్టించింది.

మంగళవారం తసీర్ ఇస్లామాబాద్‌లో విదేశీయులు, సంపన్న పాకిస్తానీలు ఎక్కువగా సందర్శించే ఖోసర్ మార్కెట్‌కు చేరుకున్న తర్వాత ప్రత్యేక భద్రతా దళానికి చెందిన తసీర్ అంగరక్షకుల్లో ఒకరు ఆయనను కాల్చి చంపేసారని పోలీసు అధికారి మహమ్మద్ ఇఫ్తికార్ చెప్పారు. హంతకుడిని అదుపులోకి తీసుకుని, విచారణ జరుపుతున్నట్లు ఇప్తికార్ వెల్లడించారు. ఈ సంఘటనలో తసీర్ హతమవడంతో పాటు మరో ఐదుగురు అంగరక్షకులు గాయపడినట్లు పోలీసులు చెప్పారు.

2007 లో మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో హత్య తర్వాత పాకిస్తాన్‌లో ఓ ప్రముఖ నాయకుడిని కాల్చి చంపడం ఇదే మొదటిసారి. తసీర్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పిపిపి)లో బలమైన నాయకుడే కాకుండా పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం.

వివాదాస్పద దైవదూషణ వ్యతిరేక చట్టంతో సహా అనేక అంశాలపై తసీర్ ఇటీవలి కాలంలో తన అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేస్తూ వచ్చారు. ఇస్లామిక్ మతవాదులు ఈ వివాదాస్పద చట్టాన్ని గట్టిగా సమర్థించడమే కాకుండా దాన్ని వ్యతిరేకించిన వారిని దుయ్యబట్టారు. ఈ కారణాలే తసీర్ హత్యకు ప్రధాన కారణమయ్యాయని వార్తలు వస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments