Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్షోభంలో పడ్డ పాక్ సర్కారు: కూలిపోవడం ఖాయమేనా..!?

Webdunia
సోమవారం, 3 జనవరి 2011 (10:42 IST)
కొత్త సంవత్సరంలో పాకిస్థాన్ సర్కారుకు గడ్డు కాలమే ఎదురయ్యేలా ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) నేతృత్వంలోని పాక్ సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉన్న ముత్తహిదా కవామీ మూవ్‌మెంట్ (ఎమ్‌క్యూఎమ్) ఆదివారం ప్రభుత్వం నుంచి వైదొలగిపోయింది.

ప్రజలు ఎదుర్కొంటున్న ఉగ్రవాదం, ధరల పెరుగుదల వంటి సమస్యల పరిష్కారంలో పిపిపి సర్కారు పూర్తిగా విఫలమైనందు వల్లే ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నామని ఎమ్‌క్యూఎమ్ పేర్కొంది. పిపిపి నుంచి ఎమ్‌క్యూఎమ్ బయటకు రావడంతో 342 స్థానాలున్న పార్లమెంటు దిగువ సభలో ప్రభుత్వ బలం 157కు పడిపోయింది.

అయితే దీనిపై స్పందించిన పాక్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ మాట్లాడుతూ.. "దీనిపై నేను వ్యాఖ్యలు చేయను, మీడియా ద్వారానే నాకు విషయం తెలిసింది. ఎవ్వరున్నా లేకపోయినా ప్రభుత్వం స్థిరంగానే ఉంటుంద"ని అన్నారు. తన సర్కారుకు ఎలాంటి భయమూ లేదని గిలానీ చెప్పారు.

ఎమ్‌క్యూఎమ్‌కు సభలో 25 మంది సభ్యులున్నారు. 126 మంది సభ్యులున్న పిపిపికి ప్రస్తుతం ఇతర పార్టీలకు చెందిన 31 మంది సభ్యుల మద్దతుంది. ఎమ్‌క్యూఎమ్ మద్దతు ఉపసంహరించడంతో సాధారణ మెజారిటీకి సర్కారుకు ఇంకా 14 మంది మద్దతు కావాల్సి ఉంటుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం చేతబడి

Samantha: సమంత, రాజ్ కలిసి డిన్నర్ చేశారా? కారులో జతగా కనిపించారుగా! (video)

వార్ 2 లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ లిప్ కిస్ ల రొమాంటిక్ సాంగ్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

Show comments