Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెనజీర్ భుట్టో హత్యకు సైనిక బ్రిగేడియర్ ఇంట్లో కుట్ర!!

Webdunia
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధినేత్రి బెనజీర్ భుట్టో హత్యకు ఆ దేశ ఆర్మీకి చెందిన బ్రిగేడియర్ ఇంటిలోనే కుట్ర జరిగినట్టు ఆ దేశ మీడియా ఒక సంచలన కథనాన్ని ప్రసారం చేసింది. ఆమె హత్యపై తాజాగా జరిపిన దర్యాప్తులో ఒక బ్రిగేడియర్‌తో సహా తొమ్మిది మంది కలిసి కుట్రపన్నినట్టు తేలిందని ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ అనే పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.

ఈ కథనాలపై ఆ దేశ అంతర్గత శాఖామంత్రి రెహ్మాన్ మాలిక్ తక్షణం స్పందించారు. ఇదంతా కట్టుకథగా ఆయన కొట్టిపారేశారు. కాగా, ఈ తాజా దర్యాప్తు మాలిక్ పర్యవేక్షణలోనే జరగడం గమనార్హం. అయితే ప్రాథమిక దర్యాప్తులోని విషయాలను సొంత పార్టీ నేతలకు కూడా తెలియకుండా అత్యంత రహస్యంగా ఉంచినట్టు ఆ పత్రిక పేర్కొంది.

కుట్రపన్నిన తొమ్మిది మందిలో నలుగురు చనిపోయినట్టు తెలుస్తోంది. కాగా, ఈ కథనంపై దర్యాప్తు చేసేందుకు పాక్ ప్రభుత్వం సంయుక్త విచారణ బృందాన్ని నియమించింది. మరోవైపు, దేశంలో చాలామంది ఉగ్రవాదులు చట్టం నుంచి తప్పించుకుంటున్నారని, అందువల్ల ఉగ్రవాద నిరోధక చట్టాన్ని మరింత కఠినతరం చేయాల్సిన అవసరముందని పాక్ ప్రధాని గిలానీ వ్యాఖ్యానించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments