Webdunia - Bharat's app for daily news and videos

Install App

900 కోట్ల డాలర్లు స్వాహా చేసిన సూడాన్ అధ్యక్షుడు: లీక్స్

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2010 (13:20 IST)
ప్రపంచ దేశాల అక్రమాలను, అవినీతిని బయటపెట్టే వికీలీక్స్ మరో సంచలనకర విషయాన్ని బహిర్గతం చేసింది. సూడాన్‌ అధ్యక్షుడు ఒమర్‌ అల్‌ బషీర్‌ దాదాపు 900 కోట్ల డాలర్లను అక్రమంగా తన ఖాతాలలో జమ చేసుకున్నట్లు వికీలీక్స్ పేర్కొంది.

చమురు ద్వారా వచ్చిన ఈ ఆదాయాన్ని సూడాన్ దేశాన్ని దాటించి లండన్‌లోని తన బ్యాంకు ఖాతాలలో జమ చేసుకున్నట్లు వికీలీక్స్ తెలిపింది. అసలే పేదరికంలో మగ్గుతున్న సూడాన్‌ నుంచి మొత్తంలో బషీర్ అవినీతికి పాల్పడటం పట్ల విమర్శకులు మండిపడుతున్నారు. వివిధ లండన్‌ బ్యాంకులో ఉన్న బషీర్‌ అక్రమ సంపాదన సూడాన్‌ స్థూల జాతీయోత్పత్తిలో (జిడిపి) పది శాతం వరకూ ఉండవచ్చని అంచనా.

అమెరికా దౌత్యాధికారులు, అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ మధ్య జరిగిన సంభాషణలను వికీలీక్స్ బహిర్గతం చేసింది. బషీర్‌ తరలించిన నిధుల్లో కొంత భాగం బ్రిటన్‌లో పాక్షికంగా జాతీయమైన లాయిడ్స్‌ బ్యాంకింగ్‌ గ్రూపులో ఉన్నట్లు ప్రాసిక్యూటర్‌ లూయిస్‌ మొరెనో ఒకాంపో అమెరికా అధికారులకు తెలిపారు.

బషీర్‌ అవినీతి సంగతి బయటకు తెలిస్తే.. ఆయనపై సూడాన్ ప్రజలకున్న నమ్మకం సన్నగిల్లుతుందని, ప్రజలు ఆయను ఓ దొంగలా చూస్తారని ఒకాంపో వ్యాఖ్యానించినట్లు సీనియర్‌ అమెరికా అధికారిని ఉటంకిస్తూ ఓ కథనం వెలువడింది. అయితే దీనిపై ప్రతిస్పందించిన లాయిడ్‌ బ్యాంకు మాత్రం బషీర్‌ పేరుతో తమ వద్ద ఎలాంటి ఖాతాలు కానీ, నిధులు కానీ ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు లేవని, అస్సలు తమకు, బషీర్‌కు ఎలాంటి సంబంధం లేదని బుకాయించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ ఎన్.టి.ఆర్. పేరును వద్దన్న బాలక్రిష్ట

బాలకృష్ణ డాకు మహారాజ్ అసలు నిరాశ పరచదు : సూర్యదేవర నాగవంశీ

ఓటీటీకి నచ్చితేనే సెట్ కు వెళతాను : నిర్మాత నాగవంశీ

#AjithKumar తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కోలీవుడ్ హీరో అజిత్ (Video)

డ్రింకర్ సాయి తో ఇండస్ట్రీలో నాకో స్థానం కల్పించారు - హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

Show comments