చేసింనదంతా చేసేసి అమెరికా ఇప్పుడు తన తప్పు దిద్దుకునే పనిలో పడింది. ఇటీవలి కాలంలో వికీలీక్స్ విడుదల చేసిన ప్రపంచ దేశాలలో ఉన్న వివిధ అమెరికా దౌత్య కార్యాలయాలకు సంబంధించిన రహస్య పత్రాలను చదవకూడదని అమెరికా ఆదేశాలు జారీ చేసింది.
అమెరికాలోని ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా వికీలీక్స్ విడుదల చేసిన రహస్య పత్రాలను కాని, ఇతర పత్రాలను కానీ చూడొద్దు, చదవొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం పబ్లిక్ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచిన లేదా మీడియాలో వచ్చిన క్లాసిఫైడ్ సమాచారాన్ని ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు వీక్షించకూడదు.
ఒకవేళ అమెరికా ప్రభుత్వ అధికారి ఎవరైనా దాన్ని డీక్లాసిఫైడ్ సమాచారంగా మార్చితే తప్ప అలాంటి వాటిని చూడకూడదు. అమెరికా వైట్‌హౌస్‌లో భాగమైన మేనేజ్‌మెంట్, బడ్జెట్ కార్యాలయం ఈ నోటీస్‌ను వివిధ శాఖల అధిపతులకు జారీ చేసింది. ఆయా శాఖల సిబ్బందికి దీన్ని పంపిణీ చేయాలని కోరింది.