వాతావరణం అనుకూలించక ఎవరెస్ట్ శిఖరం వద్ద చిక్కుకున్న 1500 మంది పర్యాటకులను నేపాల్ అధికారులు సురక్షితంగా రక్షించారు. ఆర్మీ హెలికాఫ్టర్లు, ఏయిర్‌ప్లేన్ల సాయంతో వీరిని రక్షించినట్టు నేపాల్ టూరిజం బోర్డుకు చెందిన మీడియా కోఆర్డినేటర్ శరద్ ప్రధాన్ వెల్లడించారు.
దీనిపై ఆయన మాట్లాడుతూ వారం రోజులుగా ఎవరెస్ట్ శిఖరం ప్రధాన ద్వారంగా భావించే లుక్లా వద్ద వాతావరణం అనుకూలించగా చిక్కుకుని పోయారు. వీరిని రక్షించేందుకు ఎన్నో రకాల చర్యలు చేపట్టారు. ఆ చర్యలేవీ ఫలించలేదు. దీంతో నేపాల్ ఆర్మీని రంగంలోకి దింపి, వారి సహకారంతో చర్యలు చేపట్టింది.
మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ సివిల్ ఏవియేషన్, నేపాల్ టూరిజం బోర్డు విజ్ఞప్తి మేరకు రంగంలోకి ఆర్మీ హెలికాఫ్టర్లు మౌంట్ ఎవరెస్ట్ వద్ద చిక్కుకున్న పర్యాటకులను క్షేమంగా సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు శరద్ ప్రధాన్ వెల్లడించారు.