Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ టాక్సీ డ్రైవర్‌పై దాడి.. మూడు నెలల శిక్ష

Webdunia
శుక్రవారం, 15 జనవరి 2010 (13:37 IST)
ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా విక్టోరియన్‌ సిటీ బల్లారత్‌లో భారతీయ టాక్సీ డ్రైవర్‌పై దుండగుడు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన టాక్సీ డ్రైవర్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

ఆ తర్వాత నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు స్థానిక కోర్టులో హారజరు పరిచారు. తప్పును అంగీకరించడంతో నిందితునికి మూడు నెలల జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. దాడి జరిగిన కొన్ని గంటలపై నిందితునికి శిక్ష పడటం గమనార్హం.

శుక్రవారం ఉదయం సతీష్ తాటిపాముల అనే 24 సంవత్సరాల భారతీయ టాక్సీ డ్రైవర్‌పై బల్లారత్‌కు చెందిన పాల్ జాన్ బ్రోగ్డన్ అనే 48 సంవత్సరాల వ్యక్తి గాడికి పాల్పడ్డాడు. పీకల్లోతు మద్యం సేవించిన పాల్ జాన్.. టాక్సీ డ్రైవర్‌ను దుర్భాషలాడుతూ.. దాడి చేశాడు.

దీంతో గాయపడిన డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు కేసును విచారించిన మేజిస్ట్రేట్ మైఖేల్ హాడ్జ్‌సన్ మూడు నెలల జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

Show comments