Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పాప్ కింగ్" మైకేల్ జాక్సన్ మృతి

Webdunia
పాప్ కింగ్ మైకేల్ జాక్సన్ గుండెపోటుతో మృతి చెందారు. పాప్ సంగీత ప్రపంచాన్ని కొన్నేళ్లపాటు శాసించిన మైకేల్ జాక్సన్ (50) గురువారం స్థానిక కాలమానం ప్రకారం 2.26 గంటల సమయంలో మృతి చెందారని అమెరికా అధికారిక వర్గాలు వెల్లడించాయి.

జాక్సన్‌కు గురువారం గుండెపోటు రావడంతో లాస్ ఏంజెలెస్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికే ఆయనలో చలనం లేదని లాస్ ఏంజెలెస్ కౌంటీ కార్నర్స్ కార్యాలయ ప్రతినిధి ఫ్రెడ్ కారల్ సీఎన్ఎన్ ఛానల్‌తో చెప్పారు. 12.30 గంటల సమయంలో జాక్సన్‌కు గుండెపోటు వచ్చింది.

వెంటనే ఆయన నివాసం నుంచి లాస్ ఏంజెలెస్ అగ్నిమాపక శాఖ వైద్య సిబ్బందికి ఈ సమాచారం అందింది. ఆ సమయంలోనే జాక్సన్ శ్వాస తీసుకోవడం లేదు. అనంతరం ఆయనను వైద్య సిబ్బంది రోనాల్డ్ రీగన్ యూసీఎల్ఏ మెడికల్ సెంటర్‌కు తీసుకెళ్లారు. ఆస్పత్రికి తీసుకెళ్లిన తరువాత వైద్యులు ఆయన మృతి చెందినట్లు ధృవీకరించారు. మైకేల్ జాక్సన్‌కు అంతిమ నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఆస్పత్రి వద్ద, ఆయన నివాసం వద్ద గుమిగూడారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments