Webdunia - Bharat's app for daily news and videos

Install App

అటు కెసిఆర్ ఇటు పవన్ కళ్యాణ్... దడతో వణికిపోతున్న టి.కాంగ్రెస్

Webdunia
మంగళవారం, 22 ఏప్రియల్ 2014 (17:27 IST)
FILE
సీమాంధ్రలో దాదాపు భూస్థాపితమైపోయిన కాంగ్రెస్ పార్టీకి ఇపుడు తెలంగాణలోనూ భయంపట్టుకున్నట్లు కనబడుతోంది. అటు కెసిఆర్ ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో అంటూ ముందుకు వెళుతుండటంతో ఆ పార్టీ బలం తెలంగాణలో రోజురోజుకీ నేలచూపులు చూస్తోంది. దీంతో హస్తం పార్టీ నేతలకు తెలంగాణ ప్రజలు ఏం చేస్తారో అని భయంతో వణికిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ఇస్తున్నాం కనుక తెరాసను కలిపేయాలని ఓ ఫిక్సింగ్ వచ్చిన కాంగ్రెస్ ఆ తర్వాత కెసిఆర్ ఇచ్చిన షాక్ ట్రీట్మెంటుకు గిలగిల కొట్టుకుంటోంది.

ఎవరయినా పార్టీని కలిపేస్తామంటే రాష్ట్రాన్ని ఇస్తారా అంటూ సూటిగా కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆ పార్టీ నాయకులు ఆత్మరక్షణలో పడిపోతున్నారు. ఎలా మాట్లాడినా అది బూమరాంగ్ లా తిరిగి కాంగ్రెస్ పార్టీనే కొడుతోంది. కెసిఆర్ సభలకు తెలంగాణ ప్రజలు నీరాజాలు పడుతున్నారు. అదే సమయంలో మొన్నామధ్య తెలంగాణలో జరిగిన సోనియా సభ వెలవెలబోయింది. ఇంకోవైపు తాజాగా నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ తో కలిసి తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

ఈ పర్యటనలతో కాంగ్రెస్ పార్టీకి టి.లో ఏం జరుగుతుందో అని ఆందోళనలో కొట్టుమిట్టాడుతోంది. దాని ఫలితంగానే పొద్దస్తమానం విలీనం చేయలేదని పొద్దస్తమానం తెరాస పార్టీ బాస్ కెసిఆర్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు తిట్టుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారని అంటున్నారు. మరి తెలంగాణ ప్రజలు ఏ పార్టీకి ఓటు వేస్తారో చూడాలి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments