Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసలేమిటీ "దైవ కణం"...? సృష్టికి మూలం దైవమేనా...?!!

Webdunia
బుధవారం, 4 జులై 2012 (18:47 IST)
WD
జెనీవా - స్విట్జర్లాండ్‌కు సమీపంలోని సెర్న్ పరిశోధకులు సృష్టి మూలాన్ని కనుగొనే క్రమంలో మరో ముందడుగు వేశారు. 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన బిగ్ బ్యాంగ్ తర్వాత సృష్టికి మూల కారణమైన దైవ కణం ఆనవాళ్లను కనుగొన్నట్లు చెప్పారు. దాంతో మరోసారి దైవ కణంపై ఆసక్తి నెలకొన్నది.

మూడు దశాబ్దాలుగా అంతుచిక్కని ప్రశ్నగా ఉన్న దైవ కణం(గాడ్ పార్టికల్)పై తగిన ఆధారాలు సంపాదించినట్లు ప్రపంచ అతిపెద్ద అణు విస్ఫోట పరికరంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు వెల్లడించారు. దైవ కణం ఉనికిని కనుగొనే క్రమంలో స్వీడన్, ఫ్రాన్స్ సరిహద్దుల్లో ఏర్పాటైన విశాలమైన సెర్న్ కాంపెక్ల్స్‌లో బిగ్‌బ్యాంగ్ ప్రయోగాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే.

విశ్వసృష్టికి మూలం దైవమని మానవుని నమ్మకం. ఐతే శాస్త్రవేత్తలు మాత్రం దీన్ని కొట్టి పారేశారు. సూర్యుడు, చంద్రుడు, భూమి.. ఇలా ప్రతి ఒక్కటి విశ్వంలో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన క్రియల వల్ల ఏర్పడినవనీ, చెప్పుకొచ్చారు. ఐతే విశ్వంలోని కోటానుకోట్ల సౌరకుటుంబాలు క్రమబద్ధంగా సంచరిస్తూ వాటి క్రియలను సక్రమంగా నిర్వహించడం మాటేమిటి..? అంటే మళ్లీ ప్రశ్నార్థకమే. వీటి వెనుక ఏదో ఉన్నది..? అదే మనం దైవమంటే.. సైంటిస్టులు మాత్రం మూలాన్ని కనుగొనేందుకు ప్రయోగాల మీద ప్రయోగాలు చేసుకుంటూ చివరాఖరికి "దైవ కణం" వద్దకే వచ్చి ఆగారు.

విశ్వంలోని రహస్యాలను ఛేదించడానికి, సకల చరాచర సృష్టి ఏవిధంగా జరిగిందో తెలుసుకోవడానికి మనిషి ఆది నుండీ ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ఈ ప్రయోగాలన్నీ మన పూర్వీకులు ప్రతిపాదించిన ‘దైవం’ వైపే అడుగులు వేస్తున్నాయి. ఈ సృష్టికి మూలం, చరాచర జగతికి నాంది పలికింది ‘దైవ’ కణమేనంటూ శాస్తవ్రేత్తలు నిర్ధారిస్తుండటంతో, దేవుని అస్తిత్వానికి శాస్త్రప్రకారమైన నిర్ధారణలు తోడవుతున్నాయి.

సృష్టికి మూలమైన హిగ్స్ బాసన్ సంకేతాలను కనుగొనగలిగామని శాస్తవ్రేత్తలు వెల్లడించడం కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. లక్షల కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ‘బిగ్ బ్యాంగ్’ అనంతరం విశ్వం ఏర్పడడానికి ఈ ‘దైవ’ కణమే కారణమని చాలాకాలంగా శాస్త్రవేత్తల అభిప్రాయం. హిగ్స్ బాసన్‌ను తాము సంకేత ప్రాయంగా కనుగొనగలిగామే తప్ప అది ఖచ్చితంగా ఉందని నిర్ధారించే ఆధారాలను సేకరించలేకపోయామని శాస్తవ్రేత్తలు గత ఏడాది స్పష్టం చేస్తున్నారు.

అప్పట్నుంచీ ఎడతెగని దీనిపై ఎడతెగని ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుత భౌతిక శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం హిగ్స్ బాసనే ఈ సృష్టిలో ఉద్భవించిన పదార్థాలన్నిటికీ మూలం. బుధవారంనాటి సరికొత్త ఆవిష్కరణ విశ్వసృష్టి మూలం కనుగొనేందుకు ఇక ఎంతో దూరం లేదని చెపుతోంది. ఇదే విషయాన్ని ఈ పరిశోధనలో పాల్గొన్న సుమారు 2000 మంది శాస్త్రజ్ఞులు గట్టిగా చెపుతున్నారు.

ప్రపంచ మానవాళికి అత్యంత ఆసక్తిని రేపుతున్న దైవ కణం గురించి తొలిసారిగా బ్రిటిష్ శాస్తవ్రేత్త పీటర్ హిగ్స్ ప్రస్తావించాడు. దీంతో ‘దైవ’ కణ ఉనికి హిగ్స్ బాసన్‌గా ప్రచారం పొందింది. 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన బిగ్ బ్యాంగ్ అనంతరం ఈ విశ్వం ఏర్పడడానికి అవసరమైన పదార్థాన్ని, ఇంధనాన్ని అందించింది ‘దైవ’ కణమేనని పరిశోధకులు గట్టిగా నమ్ముతున్నారు. అందువల్లనే దాని మూలాన్ని కనుగొనేందుకు అహరహం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.

మొత్తమ్మీద సృష్టి మూలాల్లోకి వెళితే, ‘దైవం’ ఉన్నాడనీ, అతనే సకలచరాచర సృష్టికి మూలమని మన పూర్వీకులు ఏనాడో చెప్పిన సిద్ధాంతం మరో రూపంలో ప్రపంచం ముందుకు వస్తుంది. వేలకోట్ల రూపాయలు, వేలమంది సైంటిస్టులు కనుగొనబోయే దైవ కణం ఆవిర్భావం ఎలా.. అంటే మళ్లీ అది బ్రహ్మపదార్థమే అవుతుంది. ఈ పదార్థం కోసం మళ్లీ సైంటిస్టులు వెతక్క తప్పదు. మన పెద్దలు చెప్పినట్లు దైవం ఎలా కనబడుతుంది..? సృష్టికి మూలకారకుడైన 'దైవం'ను కనులారా సాక్షాత్కరింపజేసుకోవడం అంత తేలికైనా పనేనా..? చూద్దాం.. శాస్త్రజ్ఞులు సృష్టికి మూలం ఇదేనని ప్రపంచానికి ఏం చూపిస్తారో...?!!
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

Show comments