Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకులకు ప్రధాన "సాక్షి"గా మారుతున్న ఫేస్‌బుక్

Webdunia
సోమవారం, 2 జనవరి 2012 (12:58 IST)
WD
నెట్‌లో తలదూర్చే ప్రతి ఒక్కరికీ ఇపుడు ఫేస్‌బుక్ ఖాతా ఖచ్చితంగా ఉండి తీరుతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. సమాచార చేరవేతలో, విషయ పరిజ్ఞానాన్ని పంచుకోవడంతోపాటు వ్యక్తిగత ఇష్టాయిష్టాలను పంపుకోవడంలో ఈ ఫేస్‌బుక్ ప్రముఖ పాత్ర వహిస్తోంది. అంతెందుకు ఆధునిక జీవి జీవితంలో ఫేస్‌బుక్ బహుముఖ పాత్ర వహిస్తోంది.

ఇప్పుడిదే పెద్ద తంటా తెచ్చి పెడుతోంది. ఎలాగంటే.. ఏదైనా పార్టీకో.. ఫంక్షన్‌కో వెళితే.. అక్కడ జరిగే కొన్ని సంఘటనలతోపాటు పార్టీ మాటున జరిగే కొన్ని సాన్నిహిత్యపు చాటుమాటు వ్యవహారాలను కూడా తమ సెల్ ఫోన్లలో "క్లిక్" మనిపించేస్తున్నారు చాలామంది.

అలా క్లిక్ మనిపించిన ఫోటోలను నేరుగా ఫేస్‌బుక్‌లో పెట్టేసి.. అతడు ఆమెతో ఆ రోజు ఇలా ఉన్నాడనీ.. ఫలానా రోజున ఆమె అతడితో ఇలా చనువుగా ఉన్నదని కామెంట్లు పెడుతున్నారు. ఇవి సదరు వ్యక్తుల వైవాహిక జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

సంసారంలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. అలా మొదలైన గొడవ చివరికి విడాకుల వరకూ వెళుతున్నాయిట. ప్రతి మూడు విడాకుల కేసుల్లో ఒక కేసుకు ఫేస్‌బుక్‌లో ఉన్న సమాచారమే ప్రధాన సాక్షిగా అవతరిస్తోందట. దీంతో నెటిజన్లకు ప్రత్యేక అభ్యర్థనలు పంపుతున్నారట ఫేస్‌బుక్ యాజమాన్యం. వ్యక్తిగత దూషణలకు, వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన సమాచారాన్ని ఫేస్‌బుక్‌లో జోడించవద్దని కోరుతున్నారట. అరిచే నోరు... తిరిగే కాలు ఊరుకోదన్నట్లు.. నొక్కే చెయ్యి ఊరుకుంటుందా....?!! అలా ఊరుకుంటే ఎన్నో సంసారాలు చల్లగా ఉంటాయి మరి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమా కోసం కపిల్ శర్మ ఆడిషన్‌ చేస్తున్నారా?

Karishma Sharma: ముంబై లోకల్ రైలు నుంచి దూకిన బాలీవుడ్ నటి కరిష్మా శర్మ

Lavanya: లావణ్య త్రిపాఠి కి అభినందనలు - అథర్వ మురళి టన్నెల్ మూవీ వాయిదా

లిటిల్ హార్ట్స్ మూవీకి సపోర్ట్ చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్న స్టార్స్

ఏడాదిలో మరింత వినోదాన్ని, అనుభూతిని ఇచ్చేందుకు రెడీగా సోనీ లివ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Milk: జుట్టు ఆరోగ్యానిరి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

Show comments