Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెడిసికొట్టిన కాంగ్రెస్ దూర దృష్టి.. మొదటికే మోసం!

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2009 (16:52 IST)
కాంగ్రెస్ అధినాయకత్వం దూరదృష్టి ఆదిలోనే బెడిసి కొట్టింది. తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఇచ్చిన నోటి హమీలను నమ్ముకుని నట్టేట మునిగింది. ముఖ్యంగా.. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దూరపు చూపు(దృష్టి)కు బైర్లు కమ్మాయి. ఫలితంగా మొదటికే మోసం వచ్చింది. 'ఒకే దెబ్బకు రెండు పిట్టలు' చందంగా సమైఖ్యంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక్క దెబ్బతో రెండు ముక్కలు చేస్తే రెండు రాష్ట్రాల్లో అధికారం చెలాయించవచ్చన్న దురాశ ఆ పార్టీ హైకమాండ్ పరవు పోయేలా చేసింది.

ముఖ్యంగా.. మహానేత వైఎస్.రాజశేఖర రెడ్డి దుర్మరణం అనంతరం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. వైఎస్ వర్గం అధిష్టానాన్నే ధిక్కరించే స్థాయికి ఎదిగింది. చివరకు అధిష్టానం ఆదేశాలతో మిన్నకుండి పోయింది. ఈ నేపథ్యంలో వైఎస్ వర్గం (తనయుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి)కు చెక్ పెట్టడం, బలమైన ప్రత్యర్థిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును నిర్వీర్యం చేసేందుకు వ్యూహం పన్నింది. ఇది పూర్తిగా బెడిసికొట్టింది.

వీరిద్దరిని అదుపు చేసేందుకు ఏకైక అస్త్రంగా రాష్ట్ర విభజనను ఎంచుకుంది. ఈ అంకానికి సోనియా గాంధీ తన చతుష్టయం (చిదంబరం, వీరప్ప మొయిలీ, ఏకే.ఆంటోనీ, అహ్మద్ పటేల్)తో పాటు.. వైఎస్ వ్యతిరేక వర్గీయులు వ్యూహ రచన చేశారు. వైఎస్ జీవించి ఉన్నతం కాలం తెలంగాణ అంశాన్ని కలలో కూడా ఊహించేందుకు సాహసం చేయని కాంగ్రెస్ అధిష్టానం.. ఆయన మృతి అనంతరం రాష్ట్ర పార్టీ కార్యకలపాలను పూర్తిగా తమ అదుపులోకి తెచ్చుకునేందుకు భారీ కసరత్తు చేసింది.

ఇందులోభాగంగానే బలహీనుడైన రోశయ్యను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. అప్పటి నుంచే రాష్ట్రానికి చెడు కాలం ఆరంభమైందని పలువురు అధికార పార్టీ సభ్యులు బహిరంగంగా వ్యాఖ్యానించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

దీనికితోడు.. కాంగ్రెస్, తెరాసల మధ్య కుదిరిన లోపాయికారి ఒప్పందంతో తెరాస అధినేత కేసీఆర్‌ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారని సమాచారం. దీక్ష చేపట్టిన 12 గంటల్లో దీక్ష విరమించిన కేసీఆర్.. విద్యార్థి లోకం నుంచి వచ్చిన వ్యతిరేకతతో ఫ్లూయిడ్స్ సేవిస్తూ 11 రోజుల పాటు నిపుణులైన వైద్యుల పరిరక్షణలో ఆస్పత్రిలో ఆమరణ నిరాహార దీక్ష పూర్తి చేశారు.

శాంతియుతంగా, అహింయుత మార్గంలో తమ ఆందోళన చేస్తామని ప్రకటించిన తెరాస తద్విరుద్ధంగా తెలంగాణ ప్రాంతాల్లో దమనకాండను కొనసాగించింది. ఇదేసమయంలో కేసీఆర్ ఆరోగ్యం పూర్తిగా ప్రమాదంలో పడినట్టు నిమ్స్ వైద్యులతో ప్రకటనలు చేయించారు. ఇలా.. పక్కా ప్రణాళిక ప్రకారం కాంగ్రెస్ అధిష్టానం కేసీఆర్ నిరాహారదీక్షను విజయంవతం చేయడమే కాకుండా, ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసింది.

కొత్త రాష్ట్రాన్ని ఏడాదిన్నర కాలంలో ఏర్పాటు చేయవచ్చునని పార్టీ వర్గాలు సూచించాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువులోనే కొత్త రాష్ట్రం ఏర్పాటు జరిగినట్లయితే, తెలంగాణ ప్రాంతంలోని సీట్లు కొత్త రాష్ట్రానికి బదిలీ అవుతాయి. ప్రస్తుతం ఏయే పార్టీలకు ఎన్ని సీట్లు ఉన్నాయో ఆ ప్రాతిపదికపైనే తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది.

ప్రస్తుతం కాంగ్రెస్‌కు ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా రెండు చోట్లా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసేందుకు ఆస్కారం ఉంది. ఈ ఆశే అత్యాశగా మారింది. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఉత్పన్నమైంది. రోశయ్య సర్కారు ఏ క్షణమైనా కూలిపోయే దుస్థితికి కాంగ్రెస్ అధిష్టానమే ప్రధాన కారణమైంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan & Alluarjun : పుష్ప 2 వర్సెస్ గేమ్ ఛేంజర్ - కలెక్షన్లకు రేవంత్ రెడ్డి బ్రేక్?

గేమ్ చేంజ‌ర్‌ నుంచి క్రేజీ డోప్ సాంగ్ వచ్చేసింది

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

Show comments