Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్, వైకాపాలకు కేవీపీ ఎఫెక్ట్ తగులుతుందా...

Webdunia
బుధవారం, 23 ఏప్రియల్ 2014 (21:34 IST)
FILE
రెండంటే రెండు వారాల క్రితం అమెరికా దర్యాప్తు సంస్థ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కే.వీ.పీ. రామచంద్రరావుపై టైటానియం కుంభకోణంలో మోపిన అభియోగాలను చికాగో కోర్టు దృవీకరించింది. కెవిపిపై వచ్చిన అభియోగాలను చూసినప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాలు దీనిపై విపరీతంగా చర్చ జరిగింది. కానీ కేవీపీ మాత్రం తనపై అటువంటి నిరాధారమయిన ఆరోపణలు రావడం దురదృష్టకరమని కొట్టి పారేశారు. చికాగో కోర్టు చేసిన అభియోగాలను ఆయన నిరాధారమైనవని అన్నారు.

ఐతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ఎంపీ కేవీపీ రామచంద్రరావు అరెస్టుకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) సన్నాహాలు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. టైటానియం స్కాం మనీ లాండరింగ్ కేసులో కెవిపిపై ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో కేవీపీని అరెస్టు చేయడానికి తమకు సహకరించాలంటూ ఎప్బీఐ నోటీసులు పంపింది. ఇంటర్‌పోల్ ద్వారా అమెరికా పంపిన రెడ్ కార్నర్ నోటీసులను సీబీఐ స్వీకరించింది.

టైటానియం కుంభకోణం కేసులో వైఎస్ఆర్ ఆత్మ డాక్టర్ కేవీపీ రామచంద్రరావు అరెస్టుకు రంగం సిద్ధమైందా? అవుననే అంటోంది జాతీయ మీడియా. రాష్ట్రంలోని టైటానియం ఖనిజాన్ని విదేశీ సంస్థలకు అప్పనంగా కట్టబెట్టిన కుంభకోణంలో కేవీపీ కీలక నిందితుడంటూ అమెరికాలోని షికాగో ఫెడరల్ కోర్టు అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఓ అంతర్జాతీయ కుంభకోణానికి తమ భూభాగాన్ని వాడుకున్నారన్న ఆరోపణలతో కేవీపీ సహా మరో ఐదు మందిపై షికాగో ఫెడరల్ కోర్టు అభయోగాలు మోపిన విషయం తెల్సిందే. దీంతో కేవీపీపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది.

ఇదిలావుండగా, అమెరికాకు చెందిన అధికారులు (ఎఫ్‌బీఐ) ఢిల్లీ చేరుకున్నారని... సీబీఐ అధికారులతో చర్చలు జరుపుతున్నారని పీటీఐ తెలిపింది. భారతీయ చట్టాల పరిధిలోనే కేవీపీని అరెస్ట్ చేసే యోచనలో అమెరికా అధికారులు ఉన్నట్టు సమాచారం. దీనితో అటు కాంగ్రెస్, ఇటు వైకాపాలకు కెవిపి ఎఫెక్ట్ తగులుతుందని అంటున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments