Webdunia - Bharat's app for daily news and videos

Install App

'చుండూరు' కేసుపై హైకోర్టు తీర్పు : దళిత నేతల అసంతృప్తి!

Webdunia
బుధవారం, 23 ఏప్రియల్ 2014 (11:38 IST)
File
FILE
గంటూరు జిల్లా చుండూరు ఊచకోత తేసులో సరైన నిందితులకు వ్యతిరేకంగా చూపిన ఆధారాలు సక్రమంగా లేవని అందువల్ల శిక్షలు రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర హైకోర్టు ప్రకటించిన తీర్పుపై దళిత సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని దళిత సంఘ నేతలు, భాగ్యారావు, కత్తి పద్మారావులు ప్రకటించారు.

దీంతో చుండూరు మారణకాండ కేసు మళ్లీ మొదటికొచ్చినట్టే. రాష్ట్రంలో నరమేధం సృష్టించిన ఈ కేసుపై మంగళవారం హైకోర్టు సంచలనాత్మక తీర్పు ప్రకటించింది. ఈ కేసులో 21 మంది నిందితులకు దిగువ కోర్టు విధించిన జీవిత ఖైదును హైకోర్టు రద్దు చేసింది. మరో 35 మందికి విధించిన ఏడాది జైలు శిక్షను సైతం కొట్టివేసింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో చుండూరు ఊచకోత నిందితులకు ఊరట లభించింది.

1991 లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు అధికారులు పూర్తి సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచలేకపోయారు. నిందితులు ఎవరన్న దానిపై సరైన ఆధారాలు చూపించలేకపోయారని జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. 8 మంది దళితులను ఊచకోత కోసిన వ్యవహారం అత్యంత బాధాకరమంటూనే హైకోర్టు ఈ తీర్పు ప్రకటించింది.

నిందితులు కొన్నేళ్లుగా జైల్లో ఉన్నారని, బాధితులు, వారి కుటుంబ సభ్యులు క్షోభను అనుభవిస్తున్నారని ఈ రెండింటిలో ఏ అంశాన్ని పూడ్చలేమని కోర్టు అభిప్రాయపడింది. కాగా, హైకోర్టు తీర్పుతో ఊరట లభించడంతో నిందితులు సంతోషం వ్యక్తం చేస్తుండగా బాధిత కుటుంబాలు మాత్రం పైకోర్టుకు వెళ్తామంటున్నాయి. దీంతో ఇరవై మూడేళ్ల పంచాయతీకి ఫుల్‌స్టాప్ పడటం లేదు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments