Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్.. పిచ్చికూతలు ఆపకుంటే తాటతీస్తాం : పవన్ కళ్యాణ్

Webdunia
బుధవారం, 23 ఏప్రియల్ 2014 (10:42 IST)
File
FILE
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిచ్చిపిచ్చి కూతలు ఆపకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. కేసీఆర్ మాటలు విని ఊరుకునేవారు ఇక్కడెవరూ లేరని, అవసరమైతే తాటతీస్తామన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దని హితవు పలికారు. తెలంగాణ ఏర్పడింది రాష్ట్రంగానే... దేశంగా కాదనే విషయాన్ని కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని ఆయన సూచన చేశారు.

మంగళవారం రాత్రి హైదరాబాద్ వేదికగా జరిగిన బీజేపీ నరేంద్ర మోడీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. ఈయన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోయారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడితే క్షమించేది లేదని హెచ్చరించారు. సీమాంద్రులు ఇక్కడ ఉండొచ్చు. కానీ పోటీ చేయడానికి వీల్లేదు అంటూ కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై పవన్ తీవ్రంగా స్పందించారు.

అటువంటి పిచ్చికూతలు కూస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇది భారత దేశమని ఎవరైనా ఎక్కడైనా నివసించవచ్చని, ఎక్కడనుంచైనా పోటీ చేయవచ్చని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది తప్ప ప్రత్యేక దేశంలా ఏర్పడలేదని వ్యాఖ్యానించారు. భారత్ నుంచి పాక్ విడిపోయింది. సీమాంధ్ర, తెలంగాణ... భారతదేశంలో రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. అయితే ఈ రెండు సందర్భాలకు కులపరంగా, మతపరంగా, ప్రాంతీయపరంగా చాలా తేడా ఉంది అని పవన్ గుర్తు చేశారు.

దేశ సమగ్రతకు భంగం కలిగించే మాటలు ఇటీవల వినబడుతున్నాయని, ఏ పార్టీ అయినా, ఎవరైనా కానీ.. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడితే ఎన్డీఏ కానీ, నరేంద్ర మోదీ కానీ క్షమించరని అన్నారు. పిచ్చిపిచ్చి కూతలు కూస్తే చూస్తూ ఊరుకునే వాళ్లు ఎవరూ లేరని హెచ్చరించారు. తెలుగు జాతి ఐక్యత దెబ్బ తింటే దేశ సమగ్రత దెబ్బ తింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ భారత్‌లో అంతర్భాగమే కానీ, వేరే దేశంగా విడిపోలేదని ఈవిషయాన్ని కేసీఆర్ గ్రహించాలని హితవు పలికారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments