Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ నీ పిచ్చివాగుడు కట్టిపెట్టి... పవన్ కళ్యాణ్ హెచ్చరిక

Webdunia
మంగళవారం, 22 ఏప్రియల్ 2014 (19:53 IST)
WD
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో సీమాంధ్రులు ఉండొచ్చు కానీ, ఇక్కడ పోటీ చేసే హక్కు మాత్రం లేదని తెరాస అధినేత కెసిఆర్ అనడాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణకు చెందిన పీవీ సీమాంధ్ర నుంచి పోటీ చేసి ప్రధానమంత్రి అయ్యారని గుర్తు చేశారు. అలాగే దివంగత ప్రధాని ఇందిరాగాంధీ కూడా మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారనే విషయాన్ని కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలని వపన్ కళ్యాణ్ సూచించారు.

సీమాంధ్రులు తెలంగాణలో పోటీ చేయరాదని కేసీఆర్ పిచ్చి వాగుడు వాగుతున్నారనీ, ఆయన మాటలు కట్టిపెట్టాలన్నారు. దేశంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చని అన్నారు పవన్. తెలుగుజాతి మధ్య విద్వేషాలను రగిలిస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరిక చేశారు. రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కావాలని కలలు కంటున్నారనీ, కానీ ఆయనకు ఎలాంటి అనుభవం లేదని అన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మోడీ అనుభవం ముందు రాహుల్ గాంధీ అనుభవం ఎక్కడ అంటూ ప్రశ్నించారు.

దేశం మొత్తం మోడీని కోరుకుంటుందనీ, ఆయన పేరు ఒక్కటే మారుమోగుతోందని అన్నారు. మరొక్కసారి మళ్లీ కాంగ్రెస్ హఠావ్... దేశ్ బచావ్ అంటూ నినదించారు. ఎల్బీ స్టేడియంలో నరేంద్ర మోడీతోపాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments