Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవితా రాజశేఖర్: మమ్మల్ని జంపింగ్ జపాంగ్స్ అంటున్నారు!

Webdunia
శుక్రవారం, 18 ఏప్రియల్ 2014 (12:32 IST)
FILE
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమతి అధ్యక్షులు కేసీఆర్, పవన్‌ను విమర్శించిన విషయం తెలిసిందే. ''సంక్రాంతి పండక్కి గంగిరెద్దులొచ్చినట్లు ఎన్నికలప్పుడు కొత్త పార్టీలు వస్తాయి, వాటిని చూసి మోసపోవద్దు'' అని ఆయన పవన్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు.

అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా నటుడు రాజశేఖర్ స్పందించారు. సినీ ఆర్టిస్టులంటే గంగిరెద్దులవాళ్లు కాదని, తమలోనూ గొప్పగా చదువుకున్నవారున్నారని, తమకూ రాజకీయాల్లో పోటీ చేసే హక్కులున్నాయని అన్నారు. ఎన్టీఆర్, ఎమ్‌జీఆర్, జయలలిత వంటి మహానటులు రాజకీయాలను శాసించిన విషయం కేసీఆర్ మర్చిపోవద్దని ఆయన అన్నారు.

తమ దంపతులను ఐరన్ లెగ్స్, జంపింగ్ జపాంగ్స్ అంటున్నారని, కాబట్టి తాను రాజకీయాలకు దూరంగా ఉండి, జీవితను మాత్రం బీజేపీలో చేరాలని చెప్పానన్నారు. తాను బయట నుంచి బీజేపీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నానన్నారు. ప్రస్తుత దేశ కాలమాన పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఒక్కరే చుక్కానిలా కనిపిస్తున్నారని, అందుకే ఆయనకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నానని చెప్పారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments