Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ ట్విట్టర్‌లో ప్రచారం.. బావకే నా ఓటు.. మరి మీరు?

Webdunia
శుక్రవారం, 18 ఏప్రియల్ 2014 (11:40 IST)
FILE
సూపర్‌స్టార్ మహేష్ బాబు ట్విట్టర్‌ను వేదికగా చేసుకుని ఎన్నికల ప్రచారం చేయనున్నారు. గుంటూరు పార్లమెంట్ స్థానం గల్లా అరుణ కుమారి కుమారుడు గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తుండగా, ఆయనకు ట్విట్టర్‌లో ప్రచారం చేయాలని మహేష్ నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన బావకే నా ఓటు.. నా మద్దతు ఉంటూ మహేష్ బాబు ట్విట్టర్‌లో కామెంట్స్ పోస్ట్స్ చేసిన విషయం తెల్సిందే.

అంతేకాకుండా నా బావ, గుంటూరు టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ నాకు ఓ రోల్ మోడల్ అని చెప్పారు. అందువల్ల నా ఓటు.. నా మద్దతు ఆయనకే ఉంటుందన్నారు. గుంటూరు జిల్లాతో పాటు.. ఆంధ్రప్రదేశ్, భారత్ భవిష్యత్తు కోసం మీరూ ఆయనకు మద్దతిస్తారని ఆశిస్తాను అంటూ మహేశ్ బాబు ట్విట్టర్లో ట్వీట్ చేశారు.

తన ట్విట్టర్ ఖాతాలో మహేష్ బాబు ఇంకా ఏమని రాశాడంటే.. నా సోదరి పద్మను గల్లా జయదేవ్ వివాహం చేసుకున్నప్పుడు నా వయస్సు 13 యేళ్లు. ఆయన నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి. నా రోల్ మోడల్. నన్ను చూసిన తీరు, నా పట్ల తీసుకున్న శ్రద్ధే అందుకు కారణం. అమరరాజా గ్రూప్, అమరాన్ బ్రాండ్‌ను ఆయన ఏ స్థాయికి తీసుకెళ్లారో తెలిసిందే. మీడియా, పారిశ్రామిక రంగం ఆయన విజయాలను గుర్తించిందని తెలిపారు.

అంతేకాకుండా, జయదేవ్ ఎప్పుడూ రాజకీయాల్లోకి రావాలని అంటుంటారు. కానీ, ఎందుకో నాకెప్పుడూ అర్థం కాలేదు. రాజకీయాల ద్వారానే ప్రజలను అభివృద్ధి చేయవచ్చన్నది ఆయన ఆలోచన. రాజకీయాల ద్వారా ఎక్కువ మందికి సేవ చేయవచ్చని చెబుతారు. నేను ఆయన్ని నమ్ముతున్నాను. ఆయన మార్పు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. నా ఓటు, నా మద్దతు బావ గల్లా జయదేవ్‌కేనంటూ మహేష్ బాబు ట్వీట్స్ చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments