Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీలో కూడా చిరంజీవి టిక్కెట్ అమ్ముకున్నారా?

Webdunia
గురువారం, 17 ఏప్రియల్ 2014 (17:45 IST)
File
FILE
గత 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి.. ఆ ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ టిక్కెట్లను అమ్ముకున్నట్టు జోరుగా ప్రచారం సాగింది. అలాగే ఇపుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న ఈ కేంద్ర మంత్రి టిక్కెట్ల బిజినెస్ చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదే విషయంపై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు నంబూరు శ్రీను స్పందిస్తూ.. పీఆర్పీలో టిక్కెట్లు అమ్ముకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీలో కూడా చిరంజీవి టిక్కెట్లను అమ్ముకున్నట్టు ఆరోపించారు. ఈయన కృష్ణా జిల్లా తిరువూరులో కాంగ్రెస్ పార్టీ రెబల్‌గా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

గతంలో పీఆర్పీ నుంచి టిక్కెట్ ఇస్తానని నమ్మించిన చిరంజీవి హైదరాబాద్‌లో తనకున్న రెండున్నర ఎకరాలను పార్టీ ఆఫీసు నిర్మాణం కోసం రాయించుకున్నారని నంబూరు శ్రీను ఆరోపిస్తూ ఆ లావాదేవీకి సంబంధించిన దస్తావేజుల కాపీ కూడా చూపించారు. అయితే రెండున్నర ఎకరాలు రాయించుకున్నా తనకు తిరువూరు నుంచి పార్టీ టిక్కెట్ ఇవ్వలేదని ఆయన చెప్పారు.

అయితే తన భూమి తనకి ఇవ్వాలని చిరంజీవిని అడిగితే, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి తిరువూరు టిక్కెట్ ఇస్తానని చెప్పారని, ఇప్పుడు కూడా మోసం చేస్తూ తనకు టిక్కెట్ ఇవ్వలేదని ఆయన చెప్పారు. అందుకే తాను తిరువూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ రెబల్‌గా రంగంలోకి దిగానని ఆయన చెప్పారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments