Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్.. ఇక మూటముల్లె సర్దుకో : విజయశాంతి

Webdunia
గురువారం, 17 ఏప్రియల్ 2014 (13:04 IST)
File
FILE
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖర్ రావు ఇక మూటముల్లె సర్దుకోవడం మంచిదని మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ మాజీ నేత, కాంగ్రెస్ అభ్యర్థి, సినీ నటి విజయశాంతి సూచించారు. పదేళ్ళ క్రితం పుట్టిన టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిందంటే ఎవరైనా నమ్ముతారా అని ఆమె ప్రశ్నించారు.

ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ రాజకీయాల్లోంచి తప్పుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని ప్రకటించిన కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. ఇచ్చిన మాట మీద నిలబడకపోవడం కేసీఆర్ నైజమన్నారు.

అందువల్ల ఆయన రాజకీయాల్లోంచి రిటైర్ కావాలని సలహా ఇచ్చారు. మెదక్ ఎంపీగా ప్రజాసంక్షేమానికి తాను చేపట్టిన పనులను టీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, పద్మాదేవేందర్ రెడ్డి అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. వీధి దీపాలు, నీటి మోటార్లకు కేటాయించిన నిధులను నేతలు దుర్వినియోగం చేశారని ఆమె మండిపడ్డారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments