Webdunia - Bharat's app for daily news and videos

Install App

టి.డ్రాఫ్ట్ బిల్లుపై సంతకం చేశా... చర్చకు టైం పడుతుంది... సీఎం కిరణ్

Webdunia
శుక్రవారం, 13 డిశెంబరు 2013 (17:01 IST)
FILE
కేంద్రం నుంచి వచ్చిన టి. బిల్లు డ్రాఫ్టుపై సంతకం చేసినట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఐతే టి.బిల్లులో ఉన్న అంశాలన్నిటిపైనా చర్చ ఒక్కటే కాదు ఓటింగ్ కూడా చేయాల్సి రావచ్చన్నారు. ఎంత సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. ఐతే టి.బిల్లుపై చర్చ సంక్రాంతి పండుగ తర్వాతేనని సీమాంధ్ర నేతలు కొందరు చెపుతున్నారు. కాగా డ్రాఫ్టు బిల్లు ప్రతులన్నీ ఇంగ్లీషులో ఉన్నాయనీ, వాటిని తెలుగు, ఉర్దూల్లోకి తర్జుమా చేయించాల్సిన అవసరం ఉందన్నారు.

ఇకపోతే కాంగ్రెసు పార్టీ ఓసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి వెళ్లదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ శుక్రవారం స్పష్టం చేశారు. హైదరాబాదు అంశంలో రక్షణపరమైన వ్యవహారాలు మినహా అన్నీ తెలంగాణ ప్రభుత్వం చేతిలోనే ఉంటాయని స్పష్టం చేశారు.

అన్ని పార్టీలు నిర్ణయం తీసుకున్నాకనే తెలంగాణపై కాంగ్రెసు పార్టీ తుది నిర్ణయం తీసుకుందని తెలిపారు. హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ఉంటుందన్నారు. మొదట తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నాయన్నారు.

కిరణ్ పైన ఫిర్యాదు తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసన సభ్యులు గాంధీ భవన్‌లో దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైఖరిపై వారు డిగ్గీకి ఫిర్యాదు చేశారు. సీఎం ఉద్దేశ్యపూర్వకంగా శాసన సభకు బిల్లు రాకుండా చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రిని మార్చండి లేదా బిల్లు అసెంబ్లీకి వచ్చేలా చూడాలని వారు కోరారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments