Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు : అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిందే!!

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2013 (09:09 IST)
File
FILE
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ఇరు ప్రాంత ప్రజలను ఒప్పించాల్సిందేనని లేకుంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. విభజన అంశంపై ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్ర విభజన చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. విభజనపై కేంద్రం రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

విభజనకు ఖచ్చితంగా అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరముందన్నారు. గతంలో అసెంబ్లీ తీర్మానాల ద్వారానే మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇదే విధానాన్ని కూడా ఇక్కడ పాటించాలన్నారు. కానీ, ఇక్కడ మాత్రం అసెంబ్లీని చులకన చేస్తే ప్రజలు తిరగబడతారని ఆయన హెచ్చరించారు.

371( డి), 371(ఇ) ఆర్టికల్స్‌ను సవరించాలంటే పార్లమెంట్‌లో 2/3 మెజారిటీ అవసరమన్నారు. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే జాతీయ పార్టీలేవీ అంగీకరించవని, తాము కూడా ఒప్పుకోబోమని తెలిపారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీఎం కిరణ్.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా ముందు మాట్లాడలేకపోతున్నారని ఆరోపించారు. ఇక తనపై కేసుల మాఫీ కోసం వైసీపీ నేత వైఎస్ జగన్ బిజీగా ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sankranti: రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారా సంక్రాంతి ఫోటో.. గేమ్ ఛేంజర్‌పై చెర్రీ స్పందన

Daaku Maharaaj : డాకు మహారాజ్‌తో బాలయ్య ఒకే ఒక్కడు.. ప్రపంచ రికార్డ్ నమోదు

Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం ట్విట్టర్ అదిరింది.. బ్లాక్ బస్టర్ ఫన్ రైడ్

అఖండ 2: తాండవం మహా కుంభమేళాలో షూటింగ్ ప్రారంభం

దేవర 2కు కొరటాల శివ కసరత్తు పూజతో ప్రారంభం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

భోగి పండ్లుగా పిలిచే రేగు పండ్లు ఎందుకు తినాలి?

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

Show comments