Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ సెకండియర్ ఫలితాలు : మే 22న సిప్లమెంటరీ పరీక్షలు

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2013 (19:03 IST)
File
FILE
ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం మే 22వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖామంత్రి కె.పార్థసారథి తెలిపారు. పరీక్షకు హాజరుకాగోరే విద్యార్థులు మే 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ఆ తర్వాత అపరాద రుసుంతో ఫీజు చెల్లించే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహిస్తామని చెప్పారు.

కాగా, ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలను ఆయన శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్‌లో విడుదల చేసిన విషయం తెల్సిందే. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసిన అభ్యర్థుల కోసం ఇంటర్మీడియేట్ బోర్డు అధికారులు మార్కుల రీకౌంటింగ్, దిద్దిన సమాధాన పత్రాల జిరాక్స్ కాపీ కమ్ రీవెరిఫికేషన్ సౌకర్యాలు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. రీకౌంటింగ్ కోసం రూ.100, అన్సర్‌బుక్ రీవెరిఫికేషన్, జిరాక్స్ కోసం రూ.600 రూపాయలు రుసుము చెల్లించి పొందవచ్చని తెలిపారు.

ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments