Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి హోదాలో ఆఫీసులోనే మోపిదేవి కుట్ర : సీబీఐ

Webdunia
గురువారం, 24 మే 2012 (17:16 IST)
File
FILE
వాన్‌పిక్ సంస్థకు భూముల కేటాయింపు వ్యవహారంలో మంత్రి హోదాలోనే మోపిదేవి వెంకటరమణ తన కార్యాలయంలోనే కుట్ర పన్నారని కేంద్ర దర్యాప్తు సంస్థ కోర్టుకుకు సమర్పించిన మెమోలో తెలిపింది. పైపెచ్చు.. పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్ఎస్ మాజీ అధికారి బ్రహ్మానంద రెడ్డిలతో కలిసి మంత్రి కుట్ర చేశారని ఆరోపించారు. ఇందులో.. లావాదేవీల్లో ఎనిమిది కోట్ల రూపాయల లంచం స్వీకరించినట్టు సీబీఐ ఆరోపించింది. అందుకే మోపిదేవిని అరెస్టు చేసినట్టు సీబీఐ పేర్కొంది.

అనంతరం సీబీఐ మోపిదేవి అరెస్టును అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా సీబీఐ పలు అంశాలను వెల్లడించింది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మౌలిక వసతుల రూపకల్పన, పెట్టుబడుల శాఖామంత్రిగా పని చేసిన మోపిదేవి వాన్‌పిక్ ప్రాజెక్టుకి సంబంధించి ఇష్టానుసారం జీవోలు జారీ చేసినట్లు తమ విచారణలో తేలినట్లు పేర్కొంది.

రెండో రోజు విచారణ నిమిత్తం దిల్‌కుషా అతిథి గృహానికి వచ్చిన మోపిదేవిని అరెస్టు చేశామని తెలిపింది. మంత్రిపై 120 (బి), రెడ్‌విత్ 420, 477 (ఎ), 409 పాటు 13 (1) డి, 13(2)ఆర్‌డబ్యు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మోపిదేవి అరెస్టు వివరాలను సిబిఐ అధికారులు వారి కుటుంబ సభ్యులతోపాటు.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్‌కు తెలియజేశారు.

మోపిదేవి జారీ చేసినట్లుగా చెబుతున్న వివాదాస్పద జివోలలో జీవో నంబరు 29.. వాన్‌పిక్‌కు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల నుంచి మినహాయింపులు, జీవో నెంబర్ 30 వాన్‌పిక్‌కు రాయితీల ఒప్పందానికి ఆమోదం, జీవో నెంబర్ 31 వాన్‌పిక్‌కు భూసేకరణ ముసాయిదాకు సంబంధించి సమగ్ర ఆధారాలు సేకరించినట్లుగా సీబీఐ తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

Show comments