Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారుకు ఉప ఎన్నికలు రెఫరెండం కాదు : సీఎం కేకేఆర్

Webdunia
ఆదివారం, 1 జనవరి 2012 (13:21 IST)
తమ ప్రభుత్వానికి త్వరలో జరుగనున్న ఉప ఎన్నికలు రెఫరెండం కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ పని బాగానే ఉందన్నారు. అయినప్పటికీ.. ఈ ఉప ఎన్నికలు రెఫరెండం కాదన్నారు.

వచ్చే 2014 ఎన్నికలు తమ సర్కార్ పనితీరుకు రెఫరెండంగా తాము భావిస్తామన్నారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను త్వరలోనే ఖరారు చేస్తామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటికి దించుతుందన్నారు.

ఈ ఎన్నికల్లో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే ప్రచారానికి వెళతామన్నారు. 2014లో ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీ పూర్తిగా విలీనం కాలేదని వాస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. మంత్రి వర్గ స్థానంలో పీఆర్పీ వారికి స్థానం లభిస్తుందన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో కొత్తగా 400 మంది వైద్యులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తామని తెలిపారు. త్వరలో నామినేటేడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడతామన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుదల ఈఆర్‌సీ ఆమోదం ప్రకారమే ఉంటుందని చెప్పారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments