Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాకు "ఆరే" ముద్దు.. మరేమి వద్దు: కావూరి సాంబశివరావు

Webdunia
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం జరిపి జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సమర్పించిన నివేదికలో పేర్కొన్న అంశాల్లో చివరిదైన ఆరో సూచనే తమకు అనుకూలమని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలందరూ ముక్తకంఠంతో చెప్పారు. పైపెచ్చు.. శ్రీకృష్ణ కమిటీ నివేదికను చాలా చక్కగా తయారు చేశారని వారు అభిప్రాయపడ్డారు.

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు గురువారం రాత్రి సమావేశమైన విషయం తెల్సిందే. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఎంపీ కావూరి సాంబశివరావు మాట్లాడుతూ కృష్ణ కమిటీలో ఆరో అంశానికి తాము కట్టుబడి ఉంటామని, కమిటీ ఫైనల్‌గా చేసిన ప్రతిపాదనను సీమాంధ్ర ఎంపీలు అందరు అంగీకరిస్తున్నట్లు అధిష్టానం నేతల ముందు చెప్పినట్లు ఆయన తెలిపారు.

నివేదిక తయారు చేసేందుకు శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రంలోని అన్నిప్రాంతాల్లో విస్తృతంగా పర్యటనలు నిర్వహించిందన్నారు. అంతటితో సరిపెట్టుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా రంగాల నిపుణుల నుంచి గణాంకాలు సేకరించి చాలా చక్కటి నివేదిక తయారు చేసిందని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఏయే ప్రాంతాల్లో అభివృద్ధి ఎలా జరిగింది, 1953 నాటి పరిస్థితులు- నేటి తాజా పరిస్థితులను తన నివేదికలో పొందుపర్చిందని గుర్తు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ 25వ చిత్రం ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదల

Surender Reddy: మళ్లీ తెరపైకి సురేందర్ రెడ్డి - వెంకటేష్ తో సినిమా మొదలైంది

మీ ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా : కిరణ్ అబ్బవరం

నాని కి ఈ కథ చెప్పడానికి 8 నెలలు వెయిట్ చేశా : డైరెక్టర్ రామ్ జగదీష్

SS రాజమౌళి, మహేష్ బాబు షూటింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్న ఒడిశా ఉపముఖ్యమంత్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

Show comments