Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 14వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు?

Webdunia
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈనెల 24వ తేదీ నుంచి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించనున్న రచ్చబండ కార్యక్రమం ఫిబ్రవరి 12వ తేదీతో ముగుస్తుంది. ఆ తర్వాత ఒక రోజు విశ్రాంతి తర్వాత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలా తేదీలను ఖరారు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

అంతేకుండా, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం జరిపిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను కేంద్రానికి సమర్పించిన విషయం తెల్సిందే. ఈ నివేదిక సమర్పించిన తర్వాత జరిగే అసెంబ్లీ సమావేశాలు కావడంతో తేదీల ఖరారుపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.

వచ్చే బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇదే అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, సీపీఐ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలదీసే అంశం ఉంది. ఇది తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంకటస్థితి కల్పించనుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ 25వ చిత్రం ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదల

Surender Reddy: మళ్లీ తెరపైకి సురేందర్ రెడ్డి - వెంకటేష్ తో సినిమా మొదలైంది

మీ ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా : కిరణ్ అబ్బవరం

నాని కి ఈ కథ చెప్పడానికి 8 నెలలు వెయిట్ చేశా : డైరెక్టర్ రామ్ జగదీష్

SS రాజమౌళి, మహేష్ బాబు షూటింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్న ఒడిశా ఉపముఖ్యమంత్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

Show comments