Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ నేతలే సమైక్యరాగం వినిపించ వచ్చునేమో: హరీష్

Webdunia
శనివారం, 15 జనవరి 2011 (16:58 IST)
ప్రస్తుత మారుతున్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తుంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలే సమైక్యరాగానికి జైకొట్ట వచ్చుననే సందేహం కలుగుతుందని తెలంగాణ ప్రాంత నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే టి.హరీష్ రావు అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డారన్నారని ఆరోపించారు.

ఇందుకోసం ఆయన కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన తెదేపా నేతలు మెత్తబడటానికి కూడా ఇదే కారణమై ఉండవచ్చన్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలే సమైక్యరాగం అందుకునేలా ఉన్నారని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఎవరు ఎలా మారినా తాము మాత్రం లక్ష్యాన్ని చేరుకునేంత వరకు వెనుదిరిగే ప్రసక్తే లేదన్నారు.

అంతేకాకుండా, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు సంపూర్ణ మెజారిటీ లేదన్నారు. యువనేత జగన్‌కు బాహాటంగా 24 మంది ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు. అందువల్ల కేకేఆర్ సర్కారు మైనారిటీలో ఉందన్నారు. అయినప్పటికీ చంద్రబాబు ఎందుకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. కేకేఆర్‌తో చంద్రబాబు రహస్య ఒప్పందం కుదుర్చుకోవడం వల్లే ఈ అంశంపై ఆయన వెనుకంజ వేస్తున్నారన్నారు. అంతేకాకుండా, వారిద్దరు కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకే కుట్ర పన్నుతున్నారని హరీష్ రావు ఆరోపించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంటికి తాళం వేసి... అజ్ఞాతంలోకి నటి కస్తూరి - మొబైల్ స్విచాఫ్!!

సరైన భాగస్వామిగా సరైన వ్యక్తిని ఎంచుకోకపోతే జీవితం నరకమే : వరుణ్ తేజ్

కోలీవుడ్‌లో విషాదం - ఢిల్లీ గణేశ్ ఇకలేరు...

సోనీ LIV ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్‌ ట్రైలర్‌ను ఆవిష్కరణ, నవంబర్ 15న ప్రసారం

హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ సికిందర్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

Show comments